
భద్రాచలం: కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే, వారి పాలన మరీ అధ్వానంగా తయారైందని సీపీ ఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. గురువారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, పెట్టుబడిదారుల కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు, దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో ప్రజలకు నష్టమేనన్నారు.
అందుకే వీటికి ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ ఏర్పడిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ వంతపాడుతున్నారని, ఈ కారణంగా దోపిడీ వ్యవస్థ పెరిగిపోయిందని చెప్పారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంతోనే మిలాఖత్ అవుతూ వారికే మోకరిల్లుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment