
సాక్షి, మెదక్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ, ప్రజా, ఉపాధ్యాయ సంఘాలు మద్దతునిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తెలిపారు. బుధవారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన కార్మికుల పీఎఫ్ డబ్బును వాడుకున్న వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మొండిగా ఉంటున్న కేసీఆర్‌కు హైకోర్టు వివిధ సందర్భాల్లో 40 సార్లు మొట్టికాయలు వేసిందని, అయినా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. కోర్టు తీర్పును సైతం పట్టించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment