వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు ప్లాన్ ప్రకారమే రాజధాని మొదటి దశ నిర్మాణం కోసం రూ. 48,115 కోట్లు కేటాయించారు. కానీ 56 పనులు మొదలు పెట్టారట, 26 వేల కోట్ల పనులు మొదలయ్యాయి అని చెబుతున్నారు. ఏడు వేల కోట్లు మాత్రమే మీ దగ్గర ఉంటే 26 వేల కోట్లతో పనులు ఎలా చేస్తున్నారు. ఇంకా రూ. 24,500 కోట్లు అప్పుచేయాలని భావిస్తున్నారు. ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు చేసిన పనికి చెప్పిన లెక్కలకు అస్సలు పొంతన లేదు.
ఆ తొమ్మిది మంది ఎవరు?
నయా రాయ్‌పూర్ కేవలం పది వేల కోట్లతో అద్భుతంగా నిర్మించారు. రోడ్డు పనులు, హౌసింగ్, బిల్డింగ్ పనులన్నీ ఐదు సంస్థలు మాత్రమే చేస్తున్నాయి. రాజధానిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. మీరు రోడ్లు వేస్తున్నారా? ఇంకా ఏమైనా చేస్తున్నారా? ప్రజలు అమాయకుల కాదు.. అన్ని పరిశీలిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అప్పులు ఇచ్చిన ఆ తొమ్మిది మంది ఎవరు? వారి పేర్లు ఎందుకు చెప్పడంలేదు? పరిపాలనలో చంద్రబాబు అట్టర్ ప్లాఫ్. ఫెయిల్డ్ లీడర్‌గా చరిత్రలో మిగిలిపోతారు’ అంటూ చంద్రబాబుపై బుగ్గన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment