సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ భూరికార్డుల ప్రక్షాళన లోపభూయిష్టంగా ఉందన్నారు. చాలామంది రైతులకు రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందలేదన్నారు. చాలాచోట్ల పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేయలేదని విమర్శించారు.
కొత్తగా హామీలను ఇవ్వడం, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా దాటేయడం, హామీలను గుర్తుచేస్తే బెదిరించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. సమాజాన్ని మేల్కొల్పుతున్న జర్నలిస్టులు కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కుటుంబం, పసిపిల్లలతోసహా ఆత్మహత్యకు పాల్పడటం హృదయ విదారకంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కేవలం వామపక్షాల బలం మాత్రమే సరిపోదని, దీనికోసమే కాంగ్రెస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో కలసి కొత్తవేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment