చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు | Chandrababu Naidu Fail In Women Protection :ysrcp | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు

Published Sat, May 5 2018 12:33 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

Chandrababu Naidu Fail In Women Protection :ysrcp - Sakshi

మాట్లాడుతున్న మహిళా విభాగం నేతలు

కడప కార్పొరేషన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో మహిళలకు, పిల్లలకు రక్షణ కరువైందని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆమె  విలేకరులతొ  మాట్లాడుతూ టీడీపీ పాలనలో బాలికలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఆకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమన్నారు.

తొమ్మిదేళ్ల   చంద్రబాబుకు రాజకీయాలపై ఉన్న శ్రద్ద మహిళల రక్షణపై లేదన్నారు.  గతంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను టీడీపీ పెద్దలే నడిపించారని, సీఎం కూడా వారికే వత్తాసు పలికారన్నారు. తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టి ఈడిస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారను. ప్రభుత్వ ఆదాయం కోసం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాలిక  కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి రూ.15లక్షల నష్ట పరిహారం  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర నేతలు బోలా పద్మావతి, ఉమా మహేశ్వరి, మరియలు, సుశీలమ్మ, తులశమ్మ, మేరి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement