women protect
-
సీఎం చంద్రబాబును కలవాలంటూ యశోదమ్మ అనే మహిళ నిరసన
-
వారి బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులదే: డీజీపీ
సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామంలోని మహిళల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. గురువారం డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల సమస్యలు తీర్చే బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో మహిళలకు, బాలికలకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వీటిని అధిగమించడానికి మహిళా సంరక్షణ కార్యదర్శులు తోడ్పాటుగా ఉండాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల వల్ల సమాజంలో సమాజంలో పెను మార్పులు తీసుకురావలని పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్రంలో 14967 మంది కార్యదర్శులు ఉన్నారని వీరికి ఆరు నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. రెండు వారాల్లో ప్రాక్టికల్ క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మహిళా కార్యదర్శులకు ఆత్మ రక్షణ, యోగా వంటి క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. -
మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి): సమాజంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సమాజంలో జరుగుతున్న అత్యాచారాలకు, మహిళలపై వేధింపులకు ఇక కాలం చెల్లిందని మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా తగు చర్యలు చేపట్టామన్నారు. గత టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అడుగడుగునా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన హయాంలో రౌడీమూకలు విజృంభించి పట్టపగలే మహిళలపై అత్యాచారాలు చేసి దారుణంగా హత్య చేసిన సంఘటనలు జరిగాయన్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారని, మరో లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మహిళలు ఈ ఉద్యోగాలు చేపట్టి సమాజంలో ఆత్మగౌరవంతో ఆనందంగా జీవించాలని కోరారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని, అసెంబ్లీ సమావేశాల అనంతరం స్వయంగా ఇంటింటికి తిరిగి పేదల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. వైసీపీ నాయకులు మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్, ఎన్. సుధీర్‌బాబు,నెరుసు చిరంజీవి, గుడిదేశి శ్రీనివాస్ పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆళ్ళ నాని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో పలువురు మైనార్టీ సభ్యులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై నాని స్పందిస్తూ రాష్ట్రంలో మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడమే కాకుండా మంత్రివర్గంలో స్ధానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మైనార్టీల హక్కుల రక్షణ కోసం, సంక్షేమం కోసం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో వైఎస్ కుటుంబం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మైనార్టీలు పిల్లలను చదివించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అమ్మ ఒడి కార్యక్రమం పేద వర్గాలకు ఒక సంజీవని లాంటిదని చెప్పారు. మైనార్టీల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, వాటిని ప్రతి పేద మైనార్టీ కుటుంబం సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవంగా బతకాలని కోరారు. -
వరలక్ష్మీ చుట్టూ రాజకీయం!
తమిళసినిమా: నటి వరలక్ష్మి బీజేపీలో చేరారా? తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం ఇదే. కథానాయకి, ప్రతి కథానాయకి అంటే తారతమ్యాలు చూపకుండా చేతి నిండా చిత్రాలతో యమ బీజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. అంతే కాకుండా మహిళా రక్షణ కోసం సేవ్‌శక్తి అనే సేవాసంస్థను నెలకొల్పి మహిళల కోసం గళం విప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను బుధవారం బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరన్ ఆమె ఇంట్లో కలిశారు. అంతే మీడియా వరలక్ష్మీ శరత్‌కుమార్ చుట్టూ రాజకీయాన్ని అల్లేస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ తన ట్విట్టర్లో పేర్కొంటూ మహిళా రక్షణ తదితర విషయాల గురించి తాను మురళీధరన్‌తో భేటీ అయిన సందర్భంగా చర్చించిన మాట వాస్తవమేనని, ఇది మంచి భేటీగా అమరిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకోవడం మంచి పరిణామం అని అన్నారు. అయితే మురళీధరన్‌తో తన భేటీని మీడియా నిరాధార వార్తలను ప్రచారం చేస్తోందని అన్నారు. అలాంటి వారికి తాను చెప్పేదొక్కటేనన్నారు. తానూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతను గుర్తు చేసుకోవలసిన పరిస్థితిది. పైగా సినీ తారలు రాజకీయాలపై మోజు పడుతున్న తరుణం ఇది. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో! నటి వరలక్ష్మిది రాజకీయ నేపథ్యమే కదా! ఆమె తండ్రి శరత్‌కుమార్ ఒక పార్టీని నడుపుతున్న విషయం తెలిసిందే. -
‘ఆమె’కు రక్ష!
మహబూబ్‌నగర్ క్రైం : జిల్లాలో మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా ఆకతాయిల ఆట కట్టించడానికి జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన షీ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ లేదా వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, మహి ళలు తమ ఆవేదనను వాట్సాప్ ద్వారా చెప్పినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సామాజిక మాధ్యమాలను, వాట్సాప్ నంబర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కొందరు బాధితులు తల్లిదండ్రులకు చెప్పుకోలేని స్థితిలో ఉండటం, పోలీసులకు చెప్తే వివరాలు సైతం బహిర్గతం అవుతాయన్న భయం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో వాట్సాప్‌కు పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించడం.. ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం కూడా బాధ్యతగానే బృందం స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు షీటీం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 2017లో 12 ఎఫ్ఐఆర్లు, 76 కేసులలో 151 మంది యువకులకు కౌన్సిలింగ్ చేశారు. 2018 జనవరి నుంచి మే 13 వరకు 43 కేసులలో 69 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. చైతన్యం చేసేందుకు కృషి.. షీటీంల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎస్పీ షీటీంల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్, వేధింపుల వంటి సమస్యలు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని సెల్ నంబర్లు ఇస్తున్నారు. 100కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. మండల కేంద్రాల్లో సైతం.. జిల్లాకేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో సైతం ఈవ్‌టీజింగ్, వేధింపులు క్రమంగా పెరుగుతున్నా యి. ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న భావనతో బాధితులు వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. చట్టం వీరికి రక్షణగా ఉన్నా పోలీసులంటే భయం కారణంగా వారికి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో అవగహన కార్యక్రమాలు ఏర్పా టు చేసిన తర్వాత కొంత మార్పు వచ్చింది. సెల్ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాలు, స్నేహం ముసుగులో ఎదరువుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీ టీం అవసరం ఎంతో ఏర్పడుతోంది. ఫేస్బుక్లో వెల్లువలా వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టగానే మురిసిపోవడం.. క్రమక్రమంగా మెసెంజర్లలో అసభ్యకర మెసేజ్‌లు చేసే వరకూ రావడం పలు కేసుల్లో గుర్తిం చారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత యువతులు, విద్యార్థినులను ప్రేమించాలంటూ యువకులు బ్లా క్మెయిలింగ్కు దిగుతున్న ఘటనలూ కోకొల్లలు. ఈ పరిణామాన్ని ఊహించని బాధిత యువతులు షీటీంను ఆశ్రయించడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, వేర్వేరు నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్ చేయడం మాట్లాడేప్పుడు పెట్టే యడం.. కొన్నిసార్లు అసభ్యంగా మాటలు.. వంద ల సంఖ్యలో పట్టణంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేదన ఇది. పాత నంబర్ తీసేసి కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నా మందికి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇలాంటి వారి సమస్య పరిష్కరించేందుకు షీటీంలు పని చేస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ వేధింపులు.. వేధింపులు, ఈవ్ టీజింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు షీటీంలు పనిచేస్తున్నా సెల్‌ఫోన్, ఇంటర్నెట్ ఆధారిత నేరాలకు పాల్పడేవారు విద్యార్థినులు, యువతులను ఇంకా వేధిస్తూనే ఉన్నారు. తెలిసిన వారున్నా లేకపోయినా సెల్‌ఫోన్ నంబరుంటే చాలు అసభ్యంగా మాట్లా డుతుంటారు. బాధితులు మాట్లాడకపోయినా, నంబరు గుర్తించి సమాధానం ఇవ్వకపోయిన వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. పైశాచిక మనస్త త్వం ఉన్న కొందరు నేరగాళ్లు దుర్భాషలాడుతున్నారు. ఆసభ్య, అశ్లీల వీడియోలను సెల్ఫోన్లకు పంపుతున్నారు. మరికొందరు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు విరామం లేకుండా ఫోన్లు చేస్తూ హింసిస్తున్నారు. ఇలాంటి చిత్రహింసలు ఎదుర్కొంటున్న వారి లో కొంతమంది వైద్యులూ, ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగినులు ఉన్నారు. కళాజాత బృందాలతో అవగాహన జిల్లాలో షీటీం పనితీరుపై గ్రామాల్లో పోలీస్ కళాజాత బృందాలతో చైతన్యం చేస్తున్నాం. అలాగే కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వేధింపులకు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వేధించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మహబూబ్‌నగర్ బస్టాండ్, కళాశాలలు, కళాశాలలకు వెళ్లే రోడ్లపై షీటీంలు ఉంటాయి. – సంపత్, షీటీం సీఐ, మహబూబ్‌నగర్ -
నాకు న్యాయం చేయండి
సిద్దిపేటకమాన్ : రెండో పెళ్లికి సిద్ధమైన తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని సిర్సినగండ్లకు చెందిన సరిత కన్నీటి కన్నీటి పర్యంతమైంది. ఆడపిల్లలు పుట్టారనే నెపంతో విడాకులు తీసుకుంటున్నట్లు లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించి, అనంతరం నా న్యాయవాదితో కుమ్మక్కై థర్డ్ పార్టీ డైవోర్స్ వచ్చినట్లు పత్రాలు సృష్టించాడని ఆవేద వ్యక్తం చేసింది. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తనకు సిర్సినగండ్లకు చెందిన తాటిపాముల శ్రీనివాస్‌తో 2006 లో విహాహం జరగగా, 2008లో మొదటి పాప, 2015లో రెండో పాప పుట్టిందని తెలిపింది. రెండవ పాప పుట్టిన అనంతరం తాను పుట్టింకి వెళ్లగా భర్త రాలేదని, కనీసం ఇంటికి రమ్మని కూడా అనలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత డైవోర్స్ కేసు ఫైల్ చేసి, నా తరపు లాయర్‌తో కుమ్మక్కై తనకు తెలియకుండానే ఎక్స్ పార్టీ డైవోర్స్ తీసుకున్నాడని కన్నీటి పర్యంతం అయ్యింది. ఆ కాపీని అందరికి చూపిస్తూ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిపింది. ఈ నెల 6న చేర్యాల మండలం మర్రిముచ్చాలకు చెందిన ఓ అమ్మాయితో కొమురవెల్లి దేవస్థానంలో పెళ్లికి సిద్ధమవ్వగా తాను కేసు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెళ్లి ఆపారని తెలిపింది. గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారని చెప్పింది. గ్రామంలో మంగళవారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడడానికి వెళ్లగా భర్త రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు అతనికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఆ తర్వాత స్విచ్ఛాప్ చేసుకున్నాడని తెలిపింది. తన లాగే మరో అమ్మాయి మోస పోకుండా ఉండాలనే విలేకరుల సమావేశం నిర్వహించినట్లు చెప్పింది. -
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో మహిళలకు, పిల్లలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆమె విలేకరులతొ మాట్లాడుతూ టీడీపీ పాలనలో బాలికలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఆకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబుకు రాజకీయాలపై ఉన్న శ్రద్ద మహిళల రక్షణపై లేదన్నారు. గతంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను టీడీపీ పెద్దలే నడిపించారని, సీఎం కూడా వారికే వత్తాసు పలికారన్నారు. తహసీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టి ఈడిస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారను. ప్రభుత్వ ఆదాయం కోసం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి రూ.15లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర నేతలు బోలా పద్మావతి, ఉమా మహేశ్వరి, మరియలు, సుశీలమ్మ, తులశమ్మ, మేరి పాల్గొన్నారు. -
పెళ్లి చేయకుంటే చావే శరణ్యం
కుల్కచర్ల : ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి ఐదేళ్లుగా న్యాయం పోరాటం చేస్తోంది. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలసిపోయానని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తనకు నా అనే వారు ఎవరూ లేరని.. ఉన్న గ్రామంలోనూ తన ప్రేమకు మద్ధతు లభించడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగకుంటే తనకు చావు తప్ప మరో దారి లేదని చెబుతోంది. న్యాయం కోసం ప్రేమించిన యువకుడి ఇంటి ముందు యువతి బైఠాయించిన సంఘటన మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన అనసూయ అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు గత 5 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఆ తరువాత ఆంజనేయులుకు ఆర్మీలో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్ కోసం వెళ్లి తిరిగొచ్చాడు. గ్రామానికి వచ్చిన ఆంజనేయులను పెళ్లి చేసుకుందామని అనసూయ అడగడంతో నీతో నాకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో గ్రామంలొ కుల పంచాయతీ పెట్టారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో యువతి 2016 ఏప్రిల్ 7న కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఆంజనేయులుతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అందరూ బెయిలుపై బయటకొచ్చారు. అనంతరం ఆంజనేయులు ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో 2017 మే 13న తనకు న్యాయం చేయాలని కోరుతూ అనసూయ యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. అతనితో పెళ్లి జరిపించాలని అక్కడే కూర్చుంది. కుల్కచర్ల పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి సర్తిచెప్పి పంపించారు. 15 రోజుల క్రితం ఆంజనేయులు ఉద్యోగం నుంచి రావడంతో అనసూయ గురువారం నుంచి అతడి ఇంటి ముందు బైఠాయించింది. ఆంజనేయులు ఇంటి వారు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ యువతికి మద్దతుగా పరిగి మహిళా సంఘం మహిళలు మద్దతు పలికారు. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మహిళలు తెలిపారు. ప్రేమించిన వ్యక్తికోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని.. న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే పెళ్లి... లేదంటే చావు నాకు ఉన్నవి రెండే దారులు. మొదటిది ఆంజనేయులుతో పెళ్లి.. లేదంటే ఆత్మహత్య చేసుకుని ఇక్కడే అతని ఇంటి ముందే చనిపోతా. ఇప్పటికే పోలీస్స్టేషన్లకు, కోర్డుల దగ్గరకు ప్రజాప్రతినిధుల దగ్గరకు, మహిళా సంఘాల వద్దకు, కుల పెద్దల దగ్గరకు తిరిగి అలసిపోయాను. గత మూడేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు అమ్మనాన్నలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే. మా గ్రామంలో కూడా నాకెవరూ మద్ధతు తెలుపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆంజనేయులతో వివాహం జరగకుంటే చావు తప్ప మరో మార్గం లేదు. – అనసూయ, అనంతసాగర్ బాధిత మహిళ -
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
ఇబ్రహీంపట్నం: మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి (పాత జిల్లాలు) ఎన్ఎస్ఎస్ విద్యార్థినులకు వినోభానగర్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో 5 రోజుల పాటు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇచ్చారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణకు మహిళలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్స్, 100 నెంబర్‌కు డయల్ చేయాలని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి.విష్ణుదేవ్, కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, డెరైక్టర్ వంశీకృష్ణ, ఏఓ వెంకట్, సీఐ స్వామి, కరాటే మాస్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.