కర్నూలు జిల్లా నందికొట్కూరులో 2015 ఆగస్టు 17వ తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన అల్ట్రా మెగా ఫుడ్ పార్కు శిలాఫలకం
సాక్షి నెట్‌వర్క్ : కర్నూలు జిల్లాలో 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన మెగా సీడ్ పార్క్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులు శిలా ఫలకాలకే పరిమితమయ్యాయి. ‘ఏరో సిటీ’ గాలి కబుర్లుగానే మిగిలిపోయింది. అట్టహాసంగా ప్రారంభించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం మధ్యలోనే ఆగిపోవడంతో బాలింతలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
నేను..హామీని!
ఎన్నికలొచ్చేశాయి. నాయకుల నోటì æవెంట, పత్రికల పతాక శీర్షికల్లోనూ నా ప్రస్తావనే. ఇంతకీ నేనెవరో గుర్తు పట్టారా! నా పేరు ‘హామీ’. పురాణ కాలం నుంచీ నేనున్నాను. ఆ కాలంలో నన్ను ‘వాగ్దానం’ అని పిలిచేవారు. రాముడు, కృష్ణుడు, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, కర్ణుడులాంటి పురాణ పురుషులెందరో వాగ్దానాల అమలు కోసం ఎన్ని కష్టాలు అనుభవించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆధునిక కాలంలో ‘హామీ’ పేరిట ప్రాచుర్యం పొందాను. మమ్మల్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకున్న నాయకులకూ విలువ పెరిగేది. అంతెందుకు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తానిచ్చిన హామీలన్నీ నెరవేర్చి మా గౌరవాన్ని ఇనుమడింపజేశారు. హామీ ఇవ్వకపోయినా అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆయన నోటివెంట హామీగా వచ్చినందుకు మేమెంత పొంగిపోయామో మీకేం తెలుసు. ఆయన పూర్వ వైభవం తెచ్చారని మురిసిపోతుండగా.. విధి వక్రించింది.
2014 ఎన్నికల్లో వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు తలపడ్డారు. చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలిచ్చి ముందువరసలో నిలబడ్డారు. అలవికాని హామీలు తాను ఇవ్వలేనని.. అమలుకు సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం ఇష్టం లేదని జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇచ్చారు. కానీ, లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు ఎన్నికల ఉచ్చు బిగించారు. మోసపూరిత హామీలతో ప్రజలను భ్రమింపచేశారు. తెలిసితెలిసీ ప్రజలు చంద్రబాబు మాయాజాలంలో చిక్కుకుపోయారు. నిజం తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హామీలకు భంగం వాటిల్లింది. ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు సింగపూర్, బాహుబలి సెట్టింగ్‌లతో గాలిమేడలెన్నో కట్టారు. అందులో అద్భుతాలు ఉన్నాయంటూ ఐదేళ్లూ కాలం గడిపేశారు. ఈరోజు కాకపోతే మరో రోజున హామీలు అమలు కాకపోతాయా అంటూ మేం ఎదురు చూస్తూ వచ్చాం. పుణ్యకాలం వెళ్లిపోయింది. చివరకు మేమెంత చులకనై పోయామో అర్థమైంది. మళ్లీ ఎన్నికలొచ్చాయ్. చంద్రబాబు నోటికొచ్చిన హామీలను ఎడాపెడా ఇచ్చేస్తున్నారు. మమ్మల్నీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ‘ప్రియమైన ఓటరులారా! ఈ ఎన్నికల్లో మా విజ్ఞప్తి ఒక్కటే.. చంద్రబాబును నమ్మకండి. విలువలతో కూడిన రాజకీయం చేసేవారిని గుర్తించండి. ఇచ్చిన హామీలను నెరవేర్చే వారిని ఎన్నుకోండి. మా విలువను గుర్తించండి. రాజకీయాల్లో విలువల్ని పెంచండి. ఇక ఉంటాను.’
‘పడకేసిన’ నిర్మాణం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో రూ.20 కోట్లతో 2014లో చేపట్టిన కొత్త భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో బాలింతలు సరిపడా మంచాలు లేక అవస్థ పడుతున్నారు. దీన్ని పూర్తి చేసేదెవరో... అవస్థలు తీరేదెప్పుడో?
మెగాసీడ్ పార్క్
కర్నూలు జిల్లా నందికొట్కూరులో 2015 ఆగస్టు 17వ తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన అల్ట్రా మెగా ఫుడ్ పార్కు శిలాఫలకంకాకినాడ ఆస్పత్రి ప్రసూతి వార్డులో ఒకే మంచంపై చంటి పిల్లలతో తల్లులు
‘గాలి’వాటం...
ఏలూరులోని వట్లూరులో 2017 మార్చిలో ఏరో సిటీకి శంకుస్థాపన చేస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం శీలంవారిపల్లెలో 23–01–2016న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవన సముదాయానికి నాటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి వేసిన శిలాఫలకం. ఇక్కడ ఇంతవరకు నిర్మాణ పనులు చేపట్టలేదు. ఒక్క ఇటుకా వేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment