మంగళవారం గాంధీభవన్ వద్ద బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహుల వరుస ఆందోళనల నేపథ్యం లో గాంధీభవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గాంధీభవన్ గేటు లోపల ప్రైవేటు బౌన్సర్లతో భద్రత కల్పిస్తుండగా.. భవన్ బయట చుట్టూరా పోలీసులు పహారా కాస్తున్నారు. సుమారు 100 మంది పోలీ సులు గాంధీభవన్ బందోబస్తులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సోమవారం రాత్రి తొలి జాబితా విడుదలకు ముందే గాంధీభవన్‌లో నిరసనలు, ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే.
ఖానాపూర్, మల్కాజ్‌గిరి, నకిరేకల్, ఉప్పల్, నాంపల్లి, వరంగల్ వెస్ట్, పటాన్‌చెరు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు గడిచిన మూడ్రోజులుగా నిరసనలతో హోరెత్తిం చారు. ఈ నేపథ్యంలో సోమవారం 65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించింది. దీంతో పాటే టీడీపీ మరో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ రాని వారు, టికెట్ ఆశిస్తున్న నేతలంతా గాంధీభవన్‌లో ఆందోళనలకు దిగే అవకాశాలుండటంతో ఉదయం నుంచే పోలీసు భద్రత పెంచారు.
గాంధీభవన్ ప్రాంగణం లోకి ఎవరూ వెళ్లకుండా ఇరువైపులా ఉన్నా రెండు గేట్లకు తాళాలు వేశారు. ఒకవేళ ఐడీ కార్డులు చూపిం చి ఎవరైనా గాంధీభవన్ ప్రాంగణంలోకి వెళ్లినా, నేతల కార్యాలయ గదుల్లోకి వెళ్లకుండా గేట్లను మూసివేశారు. ఇటు భవన్ బయట రెండు గేట్ల వద్ద పోలీస్ భద్రత పెంచారు. ఒక గేటు నుంచి ఎవరినీ లోనికి అనుమతించని పోలీసులు, ప్రధాన గేటు ద్వారా మాత్రం గాంధీభవన్ సిబ్బంది ఓకే చేప్పిన వారినే లోనికి పంపేలా ఏర్పాట్లు చేశారు.
మంగళవారం ప్రశాంతం..
గాంధీభవన్‌లో మంగళవారం ఎలాంటి ఆందోళనలు జరగలేదు. నేతలెవరూ గాంధీభవన్‌కు రాలేదు. కం టోన్మెంట్ టికెట్‌ను సర్వే సత్యనారాయణకు కేటా యించడంపై ఆ పార్టీ నేత క్రిశాంక్ మీడియా ముందు నిరసన తెలిపి వెళ్లిపోయారు. టికెట్ దక్కని ఇతర నేతలంతా ఆయా నియోజకవర్గాల నేతలతో మంతనాల్లో బిజీగా ఉండటంతో పెద్దగా సందడి కనిపించలేదు. బుధవారం మరికొంత మంది అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే నేపథ్యంలో గాంధీభవన్‌కు భద్రత యథాతథంగా కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment