ప్రతికాత్మక చిత్రం
ఢిల్లీ: హస్తినలో అర్ధరాత్రి హైడ్రామా నడుస్తోంది. కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆపాలని కోరుతూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కాసేపట్లో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ భూషణ్, జస్టిస్ బోబ్డేలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
కాంగ్రెస్-జేడీఎస్‌ల తరపును కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. బీజేపీ తరపున ఏఎస్‌జీ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్ ఆయనను ఆహ్వానించిన సంగతి తెల్సిందే. గురువారం కేవలం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. బల నిరూపణకు గవర్నర్ వాజూభాయ్ 15 రోజుల గడువు కూడా ఇచ్చిన సంగతి తెల్సిందే. బల నిరూపణ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment