‘వాళ్లు గెలిస్తే కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారు’ | Congress Will Destroy Telangana Says BJP Leader Krishna Sagar Rao | Sakshi
Sakshi News home page

‘వాళ్లు గెలిస్తే కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారు’

Published Sat, Oct 20 2018 7:04 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Will Destroy Telangana Says BJP Leader Krishna Sagar Rao - Sakshi

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కంటే ఎక్కువగా నాశనం చేస్తారని, కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో రాచరికపు పాలన ఉందన్నారు. రాహుల్ రెండు సభలకు జనం సరిగా రాలేదని, రాహుల్ మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీరు కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్టు ఉందని, సభలు కామెడీ షో లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ ఏ రాష్ట్రంలో ఉన్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదన్నారు. అవినీతి ఆరోపణ లేకుండా కేంద్రంలో, ఇతర రాష్ట్రాల్లో పాలన చేస్తుంటే! రాఫెల్ అనే ఒక గడ్డిపోచ పట్టుకుని వాదిస్తున్నారని అన్నారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘రాఫెల్ రేట్లు తెలవదు అని చెప్పి అవినీతి ఎలా జరిగింది అంటారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రాహుల్ కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడు కానీ.. కొత్త పార్టీకి కాదు. రాహుల్ కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజలు బీజేపీకి ఓటెయ్యాలి. కొత్తగా కాంగ్రెస్‌ పాలన చూడాల్సింది ఏమీ లేదు. రాహుల్ చెప్పే కథలు వినడానికి తెలంగాణ ప్రజలు తెలివి లేని వారు కాదు. తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ వస్తుంది. మిగిలిన 4 రాష్ట్రాలు కూడా బీజేపీనే గెలవబోతోంది’’అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement