
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, అనంతపురం: అనంతపురం పర్యటనలో ఉన్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాను కలిశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్తార్ చాంద్ బాషా అధికార టీడీపీ గూటికి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అత్తార్ చాంద్ బాషా ఇంటికి వెళ్లిన పవన్.. ఆయనతో భేటీ అయి ముచ్చటించారు. అలాగే, అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి కూడా పవన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా వీరి భేటీ జరిగినట్టు చెప్తున్నారు.
పవన్ కల్యాణ్ ఉదయం పరిటాల కుటుంబాన్ని కలుసుకున్న సంగతి తెలిసిందే. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చలు చేశారు. గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ పరిటాల కుటుంబాన్ని కలువడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment