defected mla
-
బీజేపీ జంప్‌జిలానీ ఎమ్మెల్యేకు ఈడీ షాక్?
ఢిల్లీ/కోల్‌కతా: టీచర్ల నియామక కుంభకోణం ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ సస్పెండెడ్ మంత్రి పార్థ ఛటర్జీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పార్థకు దగ్గరి సంబంధాలున్న అర్పితా ముఖర్జీ ఇంట నోట్ల గుట్టలు వెలుగు చూడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. ఇప్పుడు దర్యాప్తు సంస్థ లిస్ట్‌లో మరో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, రాయ్‌గంజ్ టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అతిత్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. కృష్ణ కళ్యాణి.. కళ్యాణి సోల్వెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫుడ్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీని నడుపుతున్నారు. అయితే కోల్‌కతాకు చెందిన రెండు ఛానెల్స్‌తో ఆయన కంపెనీ నిర్వహిస్తున్న లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కంపెనీ ఆర్థిక లావాదేవీలపై గత కొంతకాలంగా ఈడీ నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో.. రేపో, మాపో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేయొచ్చని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. 2021లో బీజేపీ టికెట్ తరపున గెలుపొందిన కృష్ణ కళ్యాణి.. పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలోకి మారిపోయారు. ఆ టైంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఆయనపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీఎంసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ బాధ్యతలు వహిస్తున్నారు ఈయన. 2016లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో టీచర్ నియామకాల అవకతవకలకు పాల్పడినట్లు పార్థా ఛటర్జీపై ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆయన సన్నిహితురాలు.. నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 50 కోట్లకు పైగా నగదు, ఐదు కేజీలకు పైగా బంగారం బయటపడింది. అదంతా మంత్రి పార్థా ఛటర్జీ సొమ్మేనని, ఆయన తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకునే వాడంటూ అర్పిత వాంగ్మూలం ఇచ్చింది. ఇక రాజకీయ విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఆయనపై వేటు వేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు -
తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్
సాక్షి, నల్గగొండ: తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. ‘‘బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం ఖాయం. కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతా. నేను ఏం చేయబోతున్నానో త్వరలోనే ప్రకటిస్తా’’ అని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే.. జ్వర లక్షణాలు కనిపించడంతో వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండ మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌రెడ్డి.. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే సీనియర్ల హామీతో ఆయన కొంతకాలం ఓపిక పట్టారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆయన కాషాయపు కండువా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ తరపున భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డితో కలిపి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన వాళ్లూ ఉన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేతో పవన్ భేటీ
సాక్షి, అనంతపురం: అనంతపురం పర్యటనలో ఉన్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాను కలిశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్తార్ చాంద్ బాషా అధికార టీడీపీ గూటికి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అత్తార్ చాంద్ బాషా ఇంటికి వెళ్లిన పవన్.. ఆయనతో భేటీ అయి ముచ్చటించారు. అలాగే, అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి కూడా పవన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా వీరి భేటీ జరిగినట్టు చెప్తున్నారు. పవన్ కల్యాణ్ ఉదయం పరిటాల కుటుంబాన్ని కలుసుకున్న సంగతి తెలిసిందే. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చలు చేశారు. గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ పరిటాల కుటుంబాన్ని కలువడం ఇదే తొలిసారి. -
పార్టీ ఫిరాయించి వెన్నుపోటు పొడిచారు
-
మంత్రి పదవి కోసం ప్రజలకు ద్రోహం చేశారు
-
ఎమ్మెల్యే కల్పనకు షాక్
-
ఎమ్మెల్యే కల్పనకు షాక్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు షాకిచ్చారు. ఆమె తనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన లెక్కలన్నీ తప్పని నియోజకవర్గ నేతలు తేల్చేశారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండల కన్వీనర్లు స్పష్టం చేశారు. తాము ఉప్పులేటి కల్పన వెంట వెళ్లడం లేదని మొవ్వ, పామర్రు జడ్పీటీసీ సభ్యులు విజయశాంతి, పద్మావతి తెలిపారు. కాగా.. చంద్రబాబు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు పార్థసారథి మండిపడ్డారు. ఉప్పులేట కల్పన పార్టీ మారినా ఆమె వెంట ఎవరూ వెళ్లలేదని చెప్పారు. ఆమె చెప్పిన లెక్కలన్నీ అబద్ధాలేనని తెలిపారు. నిన్నటివరకు చంద్రబాబును తూర్పారబట్టిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు పచ్చ కండువా కప్పగానే చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. సర్వేలన్నీ తనకే అనుకూలమని చెబుతున్న చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడతారా అని సవాలు చేశారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అనైతిక చర్యలు మానుకుని, ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని పార్థసారథి హితవు పలికారు.