సాక్షి, విశాఖపట్నం: భారీ వరదలు, ఎడతెగని వర్షాలతో ఛిన్నాభిన్నమైన కేరళ పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వరద విపత్తు హృదయాన్ని కలిచివేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయని అన్నారు. విపత్తుతో తల్లిడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
The devastation caused by the #KeralaFloods is gut-wrenching. My thoughts & prayers are with the people of Kerala in these testing times. Urge the Central govt to provide all possible assistance to support relief & rehabilitation measures for people affected by this calamity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2018
దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళ విపత్తులో ఇప్పటివరకు 190 మందికిపైగా చనిపోయారు. మూడు లక్షలమందిని సహాయక శిబిరాలకు తరలించారు. గత వందేళ్లలో ఎన్నడూలేనివిధంగా భారీ వరదలు ముంచెత్తడంతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. త్రివిద దళాల నేతృత్వంలో 1300 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment