అర్బన్‌ ఓటర్‌ సిగ్గుపడాలి: కొరటాల శివ | Director Koratala Siva Disappointed For Hyderabad Polling Percentage | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది : కొరటాల శివ

Published Fri, Dec 7 2018 5:05 PM | Last Updated on Fri, Dec 7 2018 9:57 PM

 Director Koratala Siva Disappointed For Hyderabad Polling Percentage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలో నమోదైన పోలింగ్‌ శాతంపై సినీ దర్శకుడు కొరటాల శివ మండిపడ్డారు. ‘అసలు ఈ హైదరాబాద్‌కు ఏమైంది. 3 గంటల వరకు 35 శాతం పోలింగేనా? అర్బన్‌ ఓటర్‌కు ఇది సిగ్గుచేటు’ అని ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం దారుణంగా నమోదైంది. చాంద్రాయణ గుట్ట, నాంపల్లిలో అయితే పోలింగ్‌ బూత్‌లు బోసిపోయి కనిపించాయి. గత ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌లో పోలింగ్‌ 50 శాతానికి మించలేదు. ఈసారి నగర పోలింగ్‌ శాతాన్ని పెంచాలని అధికారులు శతవిధాల ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడం.. పోలింగ్‌ బూత్‌ల అయోమయం ఓటింగ్‌పై ప్రభావం చూపినట్లు స్పష్టం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement