సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో గందరగోళం చోటుచేసకుంది. మంగళవారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కార్యక్రమానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఒక్కసారిగా వేదిక పైకి వచ్చారు. దీంతో బౌన్సర్లు, జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో బౌన్సర్లు జనసేన కార్యకర్తలను నెట్టివేశారు. దీంతో పలువురు జనసేన కార్యకర్తలు, ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు. అక్కడి పరిస్థితి అదుపులో లేకపోవడంతో పవన్ కల్యాణ్ ఆ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment