
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి(పాత చిత్రం)
పెద్దపల్లి జిల్లా : కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడం కేసీఆర్ తరం కాదని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరిఖనిలో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సుయాత్ర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం ప్రజల తిరస్కరానికి గురికాక తప్పదని అన్నారు. తెలంగాణా అభివృద్ధి జరగాలంటే రాహుల్ గాంధీ గద్దెనెక్కాలన్నారు. కేసీఆర్ పంజాగుట్టలో 10 ఎకరాల్లో పైరవీ భవన్ నిర్మించుకున్నాడని ఆరోపించారు.
నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. సింగరేణి గనుల కోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కథలు చెప్పడంలో మొనగాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బాల్క సుమన్‌కు కర్రు కాల్చి వాతపెట్టండని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment