
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అవినీతి పాలనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ ఏలుబడిలో జరిగిన అవినీతిపై విచారణ జరపడం ముఖ్యమైన వ్యవహారమని వ్యాఖ్యానించారు. నిందితులపై కేసులు పెట్టి విచారణ జరపాలని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని విద్యుత్ కంపెనీలను బాగు చేయాలని నిర్మల చెప్పారు. డిస్కం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 90 వేల కోట్లు కేటాయించిందని అన్నారు. ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని డిస్కంలను బాగు చేయాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిమితిని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకునే అవకాశాన్ని మరింత కల్పించామని ఆమె గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడిచేందుకు కేంద్రం చేయూతనిస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. సహకార సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మ నిర్బర ప్యాకేజీని ఉపయోగించుకోవాలని నిర్మల పేర్కొన్నారు.
(చదవండి: ‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’)