బొమ్మనహళ్లి: గడచిన కొన్ని నెలలుగా సొంత పార్టీపై గుర్రుగా ఉన్న కన్నడ రెబల్‌స్టార్, మాజీ మంత్రి అంబరీష్ బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వందతులపై ఆయన ఆదివారం స్పష్టత ఇచ్చారు. మండ్య టికెట్ ఈసారి అంబరీష్‌కు ఇవ్వాలా వద్ద అనే విషయంపై అధిష్టానం తర్జన భర్జన పడుతుండటంతో ఆయనను బీజేపీలోకి లాక్కోవడానికి ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు రెబల్‌స్టార్, నటుడు కృష్ణం రాజును ఇటీవలె అంబరీష్ హైదరాబాద్‌లో కలిసిన నేపథ్యంలో ఆయన పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే అంబరీష్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆది వారం అంబి మీడియాతో మాట్లాడుతూ... తాను బీజేపీలోకి వెళ్లటం లేదని, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు.
తన అనారోగ్య కారణాల వల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ అభిప్రాయ భేదాలు లేవన్నారు. మరోవైపు అంబరీష్ తన అనుచరులకు నాలుగు సీట్లు ఇవ్వాలని పట్టుబపడుతున్నారు. దీనికి పార్టీ అధిష్టానం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అంబి పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment