
సాక్షి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో రైతులకు ఒరిగేదేమీ లేదని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పది ఎకరాలలోపు సాగు భూములున్న రైతులు 98 శాతం మంది ఉంటారని.. వారికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక.. చీడపీడలతో ఖరీఫ్‌లో రైతులు పంట నష్టపోయారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారిని ఆదుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందని ఆరోపించారు. ఖరీఫ్‌లో పం ట నష్టపోయిన రైతులందరికీ పెట్టు బడి రాయితీ లబ్ధి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బావుల్లో నీళ్లు లేవనీ.. భూగర్భ జలాలడుగంటిపోయాయని నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.