సాక్షి, చెన్నై: కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమౌతున్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నానని కమల్ హాసన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తన పార్టీతో తమిళనాడుకు మంచి రోజులు వస్తాయని, గత, ప్రస్తుత పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని కమల్ హాసన్ అన్నారు. తన పార్టీ డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే ఉంటుందని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. పార్టీ గుర్తు, పేరు వంటి వాటిని ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇందుకోసం అభిమాన సంఘాల జిల్లా కార్యదర్శులతో చెన్నైలోని తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశమయ్యారు. పార్టీ ఆవిర్భావం, జెండా-అజెండా, పార్టీ విధివిధానాల గురించి వారితో చర్చించనున్నారు. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment