సాక్షి, బెంగళూరు : దేశం మొత్తం రసవత్తరంగా ఎదురుచూస్తున్న కన్నడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 222 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. నకిలీ ఓటర్ కార్డుల భారీగా దొరికినందుకు ఆర్ఆర్ నగర్ ఎన్నిక వాయిదా పడింది. జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మే 28న రాజరాజశ్వరినగర్(ఆర్ఆర్ నగర్) అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్ జరుగనుంది.
కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Published Sat, May 12 2018 7:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Live Updates
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అప్డేట్స్
ముగిసిన పోలింగ్
దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 70 శాతానికిపైగా పోలింగ్ నమోదు అయింది. అక్కడక్కడా చిన్నా చితక సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
హెబ్బల్ నియోజవర్గంలోని లొట్టెగొళ్లహల్లిలో రీపోలింగ్
ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా హెబ్బల్ నియోజవర్గంలోని లొట్టెగొళ్లహల్లిలో రీపోలింగ్ నిర్వహింనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.
ఈవీఎంలపై కాంగ్రెస్ ఆందోళన
ఓటు ఏ గుర్తుకు వేసిన కూడా కమళం గుర్తుకే పడుతున్నాయని, ఈవీఎంలు బీజేపీకి అనుకూలంగా తమారుచేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో హస్తం గుర్తుపై ఈవీఎం నొక్కిన కూడా కమళం గుర్తుకే పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్ఎమ్ కృష్ణ
కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్‌నేత, ప్రస్తుత బీజేపీ నేత ఎస్ఎమ్ కృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే....
అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, 14 మంది కార్యకర్తలు పోలీసులకు పట్టుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఆర్ నగర్ అభ్యర్థి ఎన్ మునిరత్నపది వేల నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
3 గంటలకు 56 శాతం పోలింగ్....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 3 గంటల వరకూ పోలింగ్ 56 శాతం నమోదు అయింది. గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
పోలింగ్ కేంద్ర వద్ద మహిళ ఆత్మహత్యయత్నం
గ్రామంలో కనీస అవసరాలు లేక ఇబ్బంది పడుతున్నారంటూ ఓ మహిళ పోలింగ్ కేంద్రం వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన హావేరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఓటు హక్కు వినియోగించుకున్న సిద్దరామయ్య
ముఖ్యమంత్రి సిద్దరామయ్య వరుణలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 113 సీట్లలో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ నేత
బీజేపీ నేత ఉమేష్ కట్టి ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించారు. చిక్కోడిలో ఓటు వేసిన ఉమేష్ తన భార్య కోసం బూత్‌లోనే వేచి ఉండడం వివాదంగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కరు మాత్రమే పోలింగ్ బూత్‌లోకి వెళ్ళాలి.
ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి
కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హెగ్డే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్లుతో పాటు మంత్రి కూడా పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న111 ఏళ్ళ మఠాధిపతి
సిద్దాగంగా మఠాధిపతి డాక్టర్ శివకుమార్ స్వామిజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 111 ఏళ్ళు నిండిన స్వామిజీ, రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న అత్యంత వయసు కలిగిన ఓటర్‌గా రికార్డు నెలకొల్పారు.
ముందు ఓటు... తరువాతే పెళ్లి
మరికొద్దిసేపట్లో పెళ్లిపీటల మీద కుర్చోవాల్సిన యువతి ఓటు వేయడానికే తన మొదటి ప్రాధాన్యతని ఇచ్చింది. పెళ్లికి కొద్దిసేపు ముందు యువతి మాడికేరి పోలింగ్ బూత్ 131లో ఓటు హక్కుని వినియోగించుకుంది.
37 శాతం పోలింగ్ నమోదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకూ 37 శాతం పోలింగ్ నమోదు అయింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ... గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఓటు హక్కు వినియోగించుకున్న దేవెగౌడ
జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. హసన్ జిల్లాలోని పోలింగ్ బూత్ 244లో దేవెగౌడ ఓటు వేశారు. జేడీఎస్ ప్రభుత్వాని ఏర్పాటు చేసేందుకు తగిన సీట్లు సాధిస్తుందని, అశాభావం వ్యక్తం చేశారు.
ఓటేసిన యడ్యూరప్ప..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శీకారిపుర పోలింగ్ బూత్‌లో యడ్యూరప్ప ఓటు వేశారు.
కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
పోలింగ్ వద్ద కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హంపీనగర్ బీజేపీ కార్పోరేటర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని బీజేపీ నేత రవీంద్ర తెలిపారు. ఈ దాడిలో కార్పోరేటర్ ఆనంద్ గాయపడ్డారని, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తల ఆందోళన
బూత్‌లో ఉన్న అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకి సూచిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కారాడీగూడ పోలింగ్ బూత్ 58 వద్ద అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మద్దతుదారులు ఆందోళన దిగారు.
ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీరాములు
బీజేపీ నేత శ్రీరాములు బల్లారిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీరాములు సిద్దరామయ్యపై బాదామి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఓటు హక్కు వినియోగించుకున్న ఖర్గే
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభపక్షనేత మల్లికార్జున ఖర్గే తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బసవనగర్లోని పోలింగ్ బూత్ 108లో ఖర్గే ఓటు వేశారు.
ఓటేసిన నవదంపతులు...
నూతన దంపతులు పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాగల్కోటలో వివాహాం అనంతరం దంపతులిద్దరూ నేరుగా పోటింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీజే
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎమ్ఎన్ఆర్ వెంకటచల్లయ్య తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బెంగళూరులో తన సతీమణితో కలిసి పోలింగ్‌లో పాల్గొన్నారు. వెంకటచల్లయ్య 1993 నుంచి 1994 వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీశ్రీ పండిట్ రవిశంకర్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఓటర్లని కోరారు.
మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది..
జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామనగర పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ...జేడీఎస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న గ్రేట్‌వాల్
అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీవీ రామన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్రావిడ్ ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న లంకేశ్
ప్రముఖ పాత్రికేయురాలు గౌరి లంకేశ్ సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉ.11 గంటలకు 24శాతం పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఉదయం 11 గంటల వరకూ 24 శాతం పోలింగ్ నమోదు అయింది.
గులాబీ కేంద్రాలు
పోలింగ్ సమయంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బెలగావిలో గులాబీ రంగులతో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లో కేవలం మహిళా అధికారులు మాత్రమే ఉంటారు.
పెళ్లి బట్టలతో... పోలింగ్ కేంద్రానికి
నూతన వధువరులు పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న అనిల్ కుంబ్లే
అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంట్లే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌లో పాల్గొన్నారు.
ఓటు వేసిన దివ్యాంగుడు
బాదామిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన దివ్యాంగుడు
10.6 శాతం ఓటింగ్ నమోదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటలకు 10.6 శాతం పోలింగ్ నమోదు అయింది.
బీజేపీవి పగటి కలలే...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ కేవలం 60 నుంచి 70 సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. అధికారంపై బీజేపీవి పగటి కలలేనని ఖర్గే వ్యాఖ్యానించారు.
ఓటు వేసిన రాజా యోగింద్ర మహాస్వామి
మూరుసవిర్ మఠం స్వామిజీ గురుసిద్ధ రాజా యోగింద్ర మహాస్వామి హుబ్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి
కర్ణాటక మంత్రి కేజే జార్జి బెంగళూరులో తన ఓటును వేశారు. ఆయన ప్రస్తుతం సర్వజ్ఞ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఓటు వేసిన హెచ్.డి దేవే గౌడ దంపతులు
హాసన్ జిల్లా హూలెనరసిపురం బూత్ నంబర్ 244లో మాజీ ప్రధాని దేవే గౌడ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: బీదర్ అర్బన్ నియోజకవర్గంలో మొరాయించిన ఈవీఎంలు
ఈవీఎంల సాంకేతిక లోపంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్
ఓటు వేసిన యడ్యూరప్ప
శికారిపురలో ఓటు వేసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు
గోపూజ చేస్తున్న బీజేపీ నేత బి.శ్రీరాములు
బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లే ముందు తన నివాసంలో గోపూజ చేస్తున్న బీజేపీ నేత బి.శ్రీరాములు
Related News By Category
Related News By Tags
-
బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేల బృందం..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. గవర్నర్ ఆహ్వానంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో శనివారం బలనిరూపణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు...
-
కమలం నెంబర్ వన్..
బెంగళూరు: అందరూ ఊహించిందే.. కానీ అనూహ్య పరిణామాలు.. కాషాయ శిబిరంలో మధ్యాహ్నం వరకు ఆనందం.. అంతలోనే ఆందోళన..! హస్తం శ్రేణుల్లో ఉదయం నుంచీ నిరాశ.. కాసేపటికే సమరోత్సాహం..! కింగ్‌మేకర్ అవుతుందనుకున్న జేడ...
-
ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారు..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 60 నుంచి 70 సీట్లే వస్తాయని, కాంగ్రెస్ అత్యధిక సీట్లలో గెలుపొంది తిరిగి అధికారం చేపడుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే...
-
ఏ ప్రాంతంలో ఏ అంశం?
వివిధ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయనున్న అంశాలు.. హైదరాబాద్ కర్ణాటక... తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారి, రాయ్‌చూర్, కొప్పళ్, బీదర్, యాద్గిర్, కలబురిగి (గుల్బర్గా) జిల్లాలు ఈ ప్రాంతం కిందకు వస...
-
‘కాంగ్రెస్‌ను నిర్దాక్షిణ్యంగా ఓడించండి’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మూడో విడత ప్రచారంలో భాగంగా కాంగ్రెస్.. బీజేపీ సహా మిగతా పార్టీలు పోటాపోటీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్...
Comments
Please login to add a commentAdd a comment