ఎప్పుడు.. ఏంటీ... | Karnataka political thriller reaches interval | Sakshi
Sakshi News home page

ఎప్పుడు.. ఏంటీ...

Published Sun, May 20 2018 5:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Karnataka political thriller reaches interval - Sakshi

విధానసభలో కాంగ్రెస్‌ నేతలు ఆజాద్, అశోక్‌ గెహ్లాట్, ఖర్గే, కేంద్రమంత్రులు సదానంద గౌడ, అనంతకుమార్‌ తదితరులు

న్యూఢిల్లీ: మే 12 నుంచి శనివారం వరకు థ్రిల్లర్‌ను తలపించిన కర్ణాటక రాజకీయ పరిణామాల క్రమం..  

► మే 12: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
► మే 15: వెలువడిన ఎన్నికల ఫలితాలు. 104 మంది సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 సీట్లు.
► ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతోపాటు కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి సంసిద్ధత.
► మే 16: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని కోరిన గవర్నర్‌ వజూభాయ్‌ వాలా.  సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని యడ్యూరప్పకు ఆహ్వానం.
► దీనికి వ్యతిరేకంగా అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌
►  మే 16, 17: అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్‌ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు
►  యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
► సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం
► మే 18: మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు బలం నిరూపించుకోవాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశం
►  ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకంపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌–జేడీఎస్‌.
►  మే 19: విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. బోపయ్య నియామకానికి సమర్థన.
► సాయంత్రం 4 గంటలకు: ‘విశ్వాస పరీక్ష ఎదుర్కోలేను. రాజీనామా చేస్తా..’ అని ప్రకటించిన యడ్యూరప్ప.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement