
భూపాలపల్లి అర్బన్: టీబీజీకేఎస్‌ను ఒక దఫాలో గెలిపిస్తే కార్మి కులను నట్టేట ముం చిందని.. ఎలాంటి హ క్కులు సాధించి పెట్టలేదని, మరోసారి దానిని గెలిపిస్తే సింగరేణిని నాశనం చేస్తుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం సింగరేణి సంస్థయేనని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.