
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నేతృత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై తాజాగా జేఏసీ చైర్మన్ కోదండరామ్ స్పందించారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జేఏసీని రాజకీయ పార్టీగా మార్చాలని శ్రేణుల నుంచి కోదండరామ్‌పై ఒత్తిడి వస్తున్న సంగతి తెలిసిందే.
30న కొలువుల కొట్లాట
నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఈ అంశంపై పోరాడేందుకు ఈ నెల 30న ‘ కొలువుల కొట్లాటసభ’ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. కోర్టు అనుమతితోనే ఈ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment