
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని, సమష్టి ఆలోచనతో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ఆదివారం విలేకరు లతో కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రం లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా రన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ స్థాపించడం అనివార్యమ న్నారు. ఇది తాను ఒంటరిగా తీసుకునే నిర్ణయం కాదని, సమష్టిగా తీసుకోవాల్సి నదన్నారు. అందుకు జేఏసీ ప్రతినిధులు, విద్యార్థి సంఘాలతో సంప్రదించాల్సి ఉంటుందన్నారు. అంతకు ముందు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని టీవీయూవీ అధ్యక్షుడు నిజ్జెన రమేశ్ ముదిరాజ్ కోదండరాంను కోరారు. టీవీయూవీ ప్రతినిధులతో కలసి ఆయన కోదండరాంకు వినతి పత్రాన్ని అందజేశారు.