కేసీఆర్, మోదీ తోడు దొంగలు: కోమటిరెడ్డి | Komati reddy venkata reddy fires on modi and kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్, మోదీ తోడు దొంగలు: కోమటిరెడ్డి

Published Mon, Nov 12 2018 3:28 AM | Last Updated on Mon, Nov 12 2018 3:28 AM

Komati reddy venkata reddy fires on modi and kcr - Sakshi

నల్లగొండ: ‘కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలు.. వారి పాలనలో పేదల సం క్షేమ పథకాలు సరిగ్గా అమ లు కావడంలేదు’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాకేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలను విస్మరించాయని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను గమనిం చి ఎన్నికల్లో కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీ పథకాన్ని అమలు చేసి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement