
సాక్షి, నల్గొండ : టీఆర్‌ఎస్‌లోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలు తమ పార్టీలోని సర్పంచ్‌తో సమానమని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి సోమవారం ఘన స్వాగతం లభించింది. ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌కి చెందిన 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. రాజగోపాల్ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను పట్టుకొని కేసీఆర్ అమ్మ, బోమ్మ అంటూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. రెండువేల రూపాయల పెన్షన్‌పై మొదటి సంతకం చేసేటట్లు, ఇళ్లు కట్టుకున్న వాళ్లకి రూ.5లక్షలు తక్షణమే ఇచ్చేటట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని రాజగోపాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment