
సాక్షి, నల్లగొండ: వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగానే పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేయబోతున్నట్టు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి ఓ బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డికి డిపాజిట్ కూడా రాదని అన్నారు.
జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోడానికే తాను ఎంపీగా పోటీచేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మికి ఎమ్మెల్యేగా పోటీచేయలనే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ టికెట్ మీద పోటీచేస్తేనే గత ఎన్నికల్లో 2లక్షల ఓట్లకుపైగా మెజారిటీ వచ్చిందని, ఈసారి తనకు అంతకుమించి వస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment