
సాక్షి, యాదాద్రి భువనగిరి: అన్నింట్లో తెలంగాణ రాష్ట్రం ముందుందని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పదహారవ స్థానానికి ఎలా దిగజారడని యాదాద్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గందమల్ల రిజర్వాయర్ నిర్మాణం లేదని అధికారులే చెబుతున్నారని, ఎన్నికల సమయంలో గందమల్ల రిజర్వాయర్ ఉందని ప్రజలను మోసం చేసిన ఆలేరు ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తవుతాయి. కానీ వాటిని పూర్తి చేయకుండా కేసీఆర్ గొప్పలు చెప్పుకోడానికి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ నాయకులపై నిందలు వేస్తున్నారన్నారు. కరోనా టెస్టుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన పరీక్షలు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment