కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సోమవారం (ఈ 21న) కొలువు తీరునుందని కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజుభాయ్ వాలాను కలుసుకుని పలు అంశాలపై కుమారస్వామి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెజార్టీ ఉందని చెప్పిన బీజేపీ బలం నిరూపించుకోలేక పోయిందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. ముందు అనుకున్నట్లుగానే తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు.
కర్ణాటక కేబినెట్ ఏర్పాటుపై ఆదివారం కాంగ్రెస్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచ్చేయనున్నారని వెల్లడించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల కీలకనేతలు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావులను ఆహ్వానించినట్లు తెలిపారు.
కాగా, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం బలపరీక్షకు వెళ్లకుండానే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆపై రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment