కోల్‌కతా : విపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేకనే.. ప్రధాని ఇలా వ్యక్తిగత దాడులకు పాల్పడుతన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం మమతా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు హిందీ సరిగా రాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అర చేతిలో వైకుంఠం చూపినట్లుగా ఉంది. ఈ బడ్జెట్ వల్ల జనాలకు ఎలాంటి ప్రయెజనం ఉండదు. ఇలా అంటున్నందుకు వారు(నరేంద్ర మోదీ) నన్ను అరెస్ట్ చేయవచ్చు. కానీ నేను ఇలాంటి వాటికి భయపడను’ అని తెలిపారు.
అంతేకాక ‘ప్రసుత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం విపక్షాలను రాజకీయంగా ఎదుర్కొలేక.. వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నదనే విషయం జనాలందరికి తెలుసు. అందులో భాగంగానే ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేయ్యండి అంటూ మోదీ.. అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రధాని ఒత్తిడి మేరకే అధికారలు ఇలా చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ ఇలాంటి చర్యలకు పూనుకుని మోదీ ప్రతిపక్షాలను తీవ్రంగా అవమానిస్తున్నార’ని మమతా ఆరోపించారు.
అయితే మమతా మోదీపై ఇలా విరుచుకు పడటానికి కారణం ఉంది. సంచలనం సృష్టించిన కోట్ల రూపాయల ‘శారద పోంజి’ స్కామ్ విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం మమతా పర్సనల్ సెక్రటరీని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మమతా, మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక వ్యక్తిగత రాగద్వేషాలకు తావు లేకుండా పవిత్రంగా రాజకీయాలు చేయగలరా అంటూ మమతా, మోదీకి సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment