అమిత్ షా
సాక్షి, మంగళూరు: కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని మే 15 (ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు)న ప్రజలు సాగనంపుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. బలమైన జాతి నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా కన్నడిగులు ఓటేయాలని పిలుపునిచ్చారు. దక్షిణ కర్ణాటకలో పలువురు హిందువులను హత్యచేసిన వారిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
అమిత్ షా మంగళవారం మంగళూరు, కావూర్‌లతో పాటు కోల్యా–తొక్కొట్టు మధ్య ర్యాలీలు నిర్వహించారు. అయితే కోల్యా నుంచి తొక్కొట్టు వెళ్తుండగా ఉల్లాల్‌లో పోలీసులు అడ్డుకున్నారు. ఓ పత్రికా విలేకరి కెమెరాను చేతుల్లోకి తీసుకున్న అమిత్ షా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తల ఫొటోలు తీశారు
కర్ణాటకలో సంకీర్ణ సర్కారు వచ్చే అవకాశం లేదని అమిత్ షా అన్నారు. పూర్తి మెజారిటీతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న దీమా వ్యక్తం చేశారు. సిద్దరామయ్య, కర్ణాటక ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన వర్ణించారు. ముందుస్తు లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment