(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)తోపాటు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నడుం బిగించారు. ఈ విషయమై అసదుద్దీన్ నేతృత్వంలోని ఆలిండియా ముస్లిం యాక్షన్ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును నేడు (బుధవారం) కలువబోతోంది. ఈ మేరకు అసద్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
ప్రగతి భవన్‌లో వీరు సీఎం కేసీఆర్‌తో భేటీ అయి.. వినతిపత్రం ఇవ్వనున్నారు. రాజ్యాంగవిరుద్ధంగా ముస్లింలపై వివక్ష చూపేలా ఉన్న సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకించాలని, ఈ విషయంలో తమకు మద్దతుగా నిలువాలని వారు ముఖ్యమంత్రిని కోరే అవకాశముంది. ఎంపీ అసద్ వెంట మత పెద్దలు ముక్తీ అజీముద్దీన్, రియజుద్దీన్, గాయజుద్దీన్, ఖుబుల్ పాషా సూతరి, మౌలానా హాసన్ బిన్ హాల్ హుముమీ, నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment