National Population Register (NPR)
-
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
జనగణన... వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ: నాలుగేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత ఎట్టకేలకు దేశ జనాభా గణన జరగనుంది. ‘‘2025 తొలినాళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 2026 కల్లా ఇది ముగియనుంది. దాని ఆధారంగా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను సవరిస్తారు. అనంతరం తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అదే జరిగితే ఆ ప్రక్రియ 2028 నాటికి పూర్తి కావచ్చు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కులగణన చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జనగణనలో భాగంగా కులగణన కూడా ఉంటుందా అన్న కీలక అంశంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. జనగణనలో భాగంగా పౌరులను అడిగేందుకు 31 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. జనగణనలో మత, సామాజిక వర్గీకరణతో పాటు, జనరల్, ఎస్సీ, ఎస్టీ గణనే గాక జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలోని ఉప విభాగాల సర్వేలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. జనగణనను సరైన సమయంలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఆగస్టులో చెప్పడం తెలిసిందే. ఈసారి కార్యక్రమం పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా జరుగుతుందని ఆయన వెల్లడించారు.మారిపోనున్న జనగణన సైకిల్: భారత్‌లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వాతంత్య్రానంతరం 1951 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటినుంచీ పెండింగ్‌లోనే ఉంది. ఈ ఆలస్యం కారణంగా జనగణన సైకిల్ కూడా మారనుంది. ఇకపై 2025–35, 2035–45... ఇలా కొనసాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ డిప్యుటేషన్‌ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్‌లో 121 కోట్ల పై చిలుకు జనాభా ఉన్నట్టు తేలింది. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 17.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.కులగణన జరపాల్సిందేనన్న కాంగ్రెస్: కులగణనకు కేంద్రం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. మోదీ సర్కారు రాజకీయ అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడతాయా, లేదా మౌనంగా ఉంటాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.లోక్‌సభ సీట్లు తగ్గుతాయేమో!జనాభా లెక్కల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఉత్తరాదితో పోలిస్తే ఆ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉండటం తెలిసిందే. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా నూతన జనగణన గణాంకాల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరిగే పోంలో తమ లోక్‌సభ స్థానాల్లో బాగా కోత పడే ఆస్కారముండటం వాటిని కలవరపెడుతోంది. ఇది రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని బాగా తగ్గిస్తుందని ఆ రాష్ట్రాలు అనుమానిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్‌సభ నియోజకవర్గాల తదుపరి పునర్ వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ నిర్దేశిస్తోంది. ఆ లెక్కన తాజా జనగణన 2025లో మొదలయ్యే పక్షంలో వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టడానికి వీలుండదు. అలాగాక వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలంటే 82వ ఆర్టికల్‌ను సవరించాల్సి ఉంటుంది. కనుక ఆ క్రతువును మొదలుపెట్టే ముందు ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
‘ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదు’
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్నందున... జనాభా లెక్కలు తీసే ప్రక్రియ ఈ ఏడాది మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్)లో తాజా వివరాలు నమోదు చేసే ప్రక్రియ కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చు. ప్రతి పదేళ్లకు ఒకసారి భారతదేశంలో జరిగే జనగణన ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణ. దేశంలోని మూలమూలలో ప్రతి ఇంటికి వెళ్లి జనాభా వివరాలను సేకరించే పనిలో ఏకంగా 30 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటారు. ‘జనగణన ఇప్పుడు అంత ముఖ్యమైన అంశం కాదు. ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదు’ అని కేంద్ర గణాంకశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2021 జనగణన మొదటిదశను ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ... ఈ ఏడాది మాత్రం మొదలయ్యే అవకాశాల్లేవని వెల్లడించారు. వాస్తవానికి జనగణన, ఎన్పీఆర్ నవీకరణ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జరగాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పీఆర్ నవీకరణను వ్యతిరేకించినా... జనగణనకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పాయి. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా జనగణనను వాయిదా వేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించాలి కాబట్టి సిబ్బందికి ఉండే ఆరోగ్యపరమైన ముప్పును తక్కువ చేయలేమని ఆ అధికారి చెప్పారు. (ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు) -
దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) ప్రతిపాదనల అమలుపై సోమవారం అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్పీఆర్, ఎన్నార్సీ లాంటి చర్యల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ పక్షాన సీఎం కేసీఆర్ సభలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడి తీర్మానానికి మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీర్మాన ప్రతులను చించేసి స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేస్తుండగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీర్మానాన్ని సభ ముందు ఆమోదానికి ఉంచారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని మండలి సైతం ఆమోదించింది. నిప్పులు చెరిగిన కేసీఆర్.. తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోం దని మండిపడ్డారు. లౌకిక, ప్రజా స్వామిక, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కేంద్రం మంటగలుపుతోం దని నిప్పులు చెరిగారు. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఓసారి విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్లీ అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సీఏఏ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, దీనిపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పునఃసమీక్ష చేయాలని విన్నవించారు. టీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంట్లో సీఏఏను వ్యతిరేకించిందని, దానికే కట్టుబడి అసెంబ్లీలోనూ వ్యతిరేకంగా తీర్మానిస్తున్నామని ప్రకటించారు. సీఏఏతో దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రజాస్వామిక, లౌకికవాదులంతా దీన్ని నిరసిస్తున్నారని చెప్పారు. వసుధైక కుటుంబవాదానికి వ్యతిరేకం.. తెలంగాణ తన సొంత నిర్మాణం చేసుకుంటూనే, దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ సామాజిక భద్రతలో రాష్ట్ర భద్రత కూడా ఇమిడి ఉన్నందున సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. వసుధైక కుటుంబంగా కలలు కంటున్న తరుణంలో, సాంకేతికత సరిహద్దులను చెరిపేస్తున్న ఈ సమయంలో సీఏఏను తెరపైకి తేవడం సమంజసం కాదన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మంది చనిపోయారు. కొందరు ఎంపీలు, కేంద్ర మంత్రులు దుర్మార్గంగా మాట్లాడారు. గోలీమారో సాలోంకు.. అంటూ బాధ్యత మరిచి వ్యహరించారు. దేశానికి ఇది వాంఛనీయం కాదు. దేశం ఇలాందిటి అంగీకరించదు. ఈ రాక్షాసానందం దేశానికి మంచిది కాదు. అంతర్జాతీయంగా మన ఖ్యాతి దెబ్బతింటుంది. దేశానికి వేరే ఇతర సమస్యలేవీ లేనట్లు, ఇదొక్కటే సమస్య అన్నట్లు కల్లోలం లేపొద్దు’అని పేర్కొన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని వారి సంగతేంటి? ‘సీఎంగా నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. చింతమడక ఇంట్లో పుట్టిన. జన్మపత్రికే ఉంది. బర్త్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి. దేశంలో నాలాగే కోట్లాది మంది సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితేంటి? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేలా ఓటరు కార్డు ఇచ్చారు. సీఏఏకు ఓటింగ్ కార్డు పనికి రాదు. ఓటరు కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు పనిచేయదంటున్నారు. దేశ ప్రధానిని ఎన్నుకునే ఓటర్ కార్డు కూడా సీఏఏకు పనిచేయదంటే ఎలా? దేశంలోకి చొరబాటుదారుల్ని అనుమతించాలని ఎవరూ చెప్పట్లేదు. మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోడ కడతామన్నారు. మయన్మార్ నుంచి చొరబాట్లు రాకుండా భారత్‌లో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతామంటే మేమూ మద్దతిస్తాం’అని తెలిపారు. వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా.. ‘ముస్లింలను మినహాయించి కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది. సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు అవుతారా? అసెంబ్లీ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానిస్తే అసెంబ్లీలోని సభ్యులంతా దేశద్రోహులేనా. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎల్కే అడ్వాణీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైందని యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు తేల్చాయి. అలాంటి విఫల ప్రయోగం మళ్లీ అవసరామా? ఇతర దేశాల నుంచి వచ్చిన కాందిశీకుల పరిస్థితేంటి? ఇతర ప్రాంతాల్లో వలసవచ్చి ఉంటున్న వారి పరిస్థితేంటి? విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా’అని సీఎం తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ద్వంద్వ వైఖరి ఎందుకు.. ‘పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఎన్నార్సీ చేస్తామని ఉంది. ఎన్నార్సీ చేయం.. ఎన్పీఆర్ మాత్రమే చేస్తామని కేంద్ర హోంమంత్రి అంటున్నారు. నివేదిక ఒకటుంటే, చెప్పేది ఇంకోటుంది. దేన్ని నమ్మాలి. అందుకే అగ్గి పుట్టింది. కేంద్రానికి ద్వంద్వ వైఖరి అక్కర్లేదు. దేశంలో 50–60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి.. ద్వంద్వ వైఖరి ఎందుకు? పౌరసత్వం ఇవ్వాలనుకుంటే రాద్ధాంతం అవసరం లేదు. నేరుగా ఇంకో విధానంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వండి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలసి పనిచేస్తున్నంత మాత్రాన అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఉండదు. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు. కశ్మీర్ విషయంలో 370 అధికరణ విషయంలో మొట్టమొదట మద్దతిచ్చింది మేమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’అని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా, ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కూడా సీఎం కేసీఆర్ ఎన్పీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్పై స్టే తీసుకురావాలని అక్బరుద్దీన్ అడిగిన అంశంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఒకే భావజాలం ఉన్న ఇతర రాష్ట్రాలను సమీకరించి పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఎన్పీఆర్పై స్టే తెచ్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని పేర్కొన్నారు. తక్షణమే అమలు నిలిపేయాలి: సీఎల్పీ నేత భట్టి ఎన్పీఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్రం కుట్రపూరితంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే సరిపోదని, ఆ చట్టం అమలు కాకుండా నిరోధించినప్పుడే తీర్మానానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక తీర్మాన చర్చలో భట్టి మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ దేశ పౌరుడో కాదో నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. బర్త్ సర్టిఫికెట్లు, మీ తల్లిదండ్రులు ఎక్కడివారనే సమాచారాలపై ధ్రువపత్రాలు ఇవ్వకపోతే.. శరణార్థి శిబిరాలకు పంపుతామనే కేంద్ర నిర్ణయం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తన లాంటి వారెందరో ఎన్పీఆర్ నియామవళికి అనుగుణంగా ఈ దేశ పౌరులమో కాదో నిరూపించుకోవడం కష్టమన్నారు. ఈ దేశ పౌరులకు ఆందోళనకరంగా మారిన సీఏఏ, ఎన్పీఆర్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, మోదీ ప్రభుత్వం ఈ సమస్యను ఒక మత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పౌరుల భద్రత, క్షేమం కోసం చట్టాలు చేయాల్సిన కేంద్రం కొన్ని వర్గాలను అణచివేసేలా చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలను తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కేరళ తరహాలో వాటి అమలు ప్రక్రియ నిలిపేస్తూ జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు భట్టి చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్యం సిగ్గుచేటు: సుమన్ మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అందరూ సమానమనే రాజ్యంగ సూత్రాన్ని కేంద్రం విస్మరించడం దురదృష్టకరమన్నారు. ఎన్పీఆర్, సీఏఏ చట్టాలతో కేంద్రం విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రగతిశీల, మేధోవర్గాలపై దాడులు చేస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. వసుధైక కుటుంబంలా జీవనం సాగిస్తున్న దేశ ప్రజల్లో పౌరసత్వ చట్టం కల్లోలం రేపిందన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడితోనే అన్నివర్గాల ప్రజలు సురక్షితంగా ఉంటారని సుమన్ అన్నారు. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏ, ఎన్పీఆర్ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిసిన మరుక్షణమే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ విడిచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఒక వర్గం మెప్పు కోసం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పుకుండా.. ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాక్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అల్పాసంఖ్యాకులు అణచివేతకు గురవుతున్నారని, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తున్నామే తప్ప.. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. గతంలోనూ ఎన్నార్సీ, ఎన్పీఆర్ సర్వేలు జరిగాయని కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు రాద్ధాంతం చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు ధోకా చేయొద్దనే వ్యాఖ్యలపై అధికారపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్‌రెడ్డి మధ్యలో స్పీకర్‌ను కోరారు. మరోసారి రాజాసింగ్ మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో తీర్మాన ప్రతులను చించి తన నిరసన తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. చదవండి: పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం ఎన్పీఆర్పై అనుమానాలొద్దు: అమిత్ షా మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు -
కేంద్రానికి కేజ్రీవాల్ ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిల్లుపై మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ తొలుత తీర్మానం చేసింది. -
ఎన్పీఆర్పై అనుమానాలొద్దు: అమిత్ షా
న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్–ఎన్పీఆర్)పై ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్ను అప్డేట్ చేసే కార్యక్రమంలో ఏ పౌరుడి వివరాలను ‘అనుమానాస్పద(డౌట్ఫుల్– డీ)’ కేటగిరీలో చేర్చబోమని తెలిపారు. అలాగే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ఏ ధ్రువ పత్రాలను కూడా పౌరులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఎన్పీఆర్ ప్రశ్నావళిలో తల్లిదండ్రుల నివాసానికి సంబంధించిన ప్రశ్నలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ.. పౌరులు తమ వద్ద లేని సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏపై గానీ, ఎన్పీఆర్పై కానీ మైనారిటీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ఎన్పీఆర్కు సంబంధించిన అనుమానాల నివృత్తికి విపక్ష నేతల బృందం తనను కలవొచ్చని సూచించారు. పౌరసత్వాన్ని రద్దు చేసే ఏ సెక్షన్ కూడా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లో లేదని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటికి సంబంధం లేకుండా ఢిల్లీ అల్లర్ల దోషులను చట్టం ముందు నిలుపుతామని పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత కొందరు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన విద్వేష ప్రసంగాల కారణంగానే ఢిల్లీ హింసాకాండ చోటు చేసుకుందని షా పేర్కొన్నారు. ప్రభుత్వమే హింసాకాండకు పురిగొల్పిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న వేళ ఏ ప్రభుత్వమైనా అలా చేస్తుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని, విదేశీ నిధులను దీనికి ఉపయోగించారని ఆరోపించారు. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసుల తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడంలో ఎలాంటి కుట్ర లేదని, ఆ బదిలీ అంతకుముందు, సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల ఆధారంగానే జరిగిందని వివరణ ఇచ్చారు. ‘ఆ ఒక్క న్యాయమూర్తే న్యాయం చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? వేరే జడ్జి న్యాయం చేయరా?’ అని ప్రశ్నించారు. కాగా, అంతకుముందు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కన్నా ప్రమాదకరమైన మత వైరస్(కమ్యూనల్ వైరస్)ను బీజేపీ వ్యాప్తి చేస్తోందని, దీని వల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. -
నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం
-
ఏపీ: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్పీఆర్లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి, బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వోలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల హోదా కల్పించాలని, ఎమ్మార్వో కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుర్తించాలని నిర్ణయించింది. ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని తీర్మానం చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇంటి పట్టాను చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ అభయన్స్‌లో ఎన్పీఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మైనార్టీ వర్గాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల్లో అదే రీతిలో అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల మంత్రివర్గం చర్చించింది. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అలా మార్పు చేసే వరకు ఎన్పీఆర్ ప్రక్రియను అభయన్స్‌లో ఉంచాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియలో హెచ్–1గా నిలిచిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌కు 2,703 ఎకరాల భూమిని అప్పగించాలని టెండర్లలో పెట్టిన నిబంధనను సడలించింది. ఆ సంస్థకు 2,200 ఎకరాల భూమిని మాత్రమే అప్పగించాలని నిర్ణయించింది. మిగిలిన 503 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం అధీనంలోకి తీసుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూమిలో మరో 362.55 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు అవసరమైన రూ.280 కోట్లను రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్)కు అనుమతి ఇచ్చింది. కాకినాడ గేట్ వే పోర్టు నిర్మాణానికి కాల వ్యవధి పొడిగింపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగిస్తూ.. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాకినాడ ఎస్ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది. ‘సిట్’కు విస్తృత అధికారాలకు ఆమోదం రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికలోని అంశాలపై దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. సిట్ కార్యాలయాన్ని పోలీసుస్టేషన్‌గా గుర్తించడానికి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేసి.. కోర్టుల్లో చార్జ్‌షీట్ ఫైల్ చేసే విస్తృత అధికారాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాల్లో మరికొన్ని.. – రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించడానికి సంబంధించిన ఉత్తర్వులకు ఆమోదం. – ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు విత్తనాలను పంపిణీ చేయడానికి.. అవసరమైన విత్తనాలను సేకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు సమ్మతి. – ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. రూ.2 వేల కోట్ల రుణంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసి.. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం. – ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆ భూమిని జలవనరుల శాఖకు అప్పగించాలని, ఎన్ఎస్పీ కాలనీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని నిర్ణయం. – కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. అందులో 44 పోస్టుల భర్తీకి అనుమతి. నీతిమాలిన రాజకీయాల్లో చంద్రబాబు నంబర్ వన్ నీతిమాలిన రాజకీయాలు చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నంబర్ వన్ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎవరూ కనిపించరని, అధికారం కోల్పోగానే నెత్తి మీద ఉన్న కళ్లు నేల చూపులు చూస్తాయన్నారు. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక మైనార్టీకి.. ఒక ఎస్టీకి స్థానం కల్పించని చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాల ప్రజలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను అవసరాలకు వాడుకోవడం.. అవసరం తీరగానే కసుక్కున కత్తితో పొడవడంలో చంద్రబాబు నేర్పరి అన్నారు. హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలతోపాటు మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహిస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం ముందే తీసుకున్నామని, వాటికి స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి సంబంధం ఉండదని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
తెలుగుదేశం ఇకనైనా మద్దతివ్వాలి
సాక్షి, విశాఖపట్నం: జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ కోస్తాంధ్ర అధ్యక్షులు బర్కత్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్పీఆర్ నమోదుకు పాతవిధానాన్నే అనుసరించాలని సీఎం జగన్ డిమాండ్ చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎఎ రాజ్యాంగ విరుద్ధమన్నారు. మోదీ సర్కారు సమాన హక్కులు, అవకాశాలు అనే రాజ్యాంగ హక్కును కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీఆర్ నమోదు 2010లో చేపట్టినట్లుగానే జరగాలని వైఎస్ జగన్ తీర్మానం చేయనున్నారని, ఆయనపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తెలుగుదేశం కూడా అసెంబ్లీలో, శాసన మండలిలో ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం ఇకనైనా మద్దతివ్వాలి ‘చంద్రబాబు నాయుడు ఇంతవరకూ ఎన్పీఆర్, సీఏఏల మీద స్పందించకపోవటం దారుణం. అమరావతి తప్ప మరో సంగతి పట్టించుకోని తెలుగుదేశం..ఇకనైనా వైకాపా ఎన్పీఆర్ మీద చేసే తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో దీన్ని అమలు జరిపేది లేదని గతంలో కడప వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. తాజాగా ఎన్పీఆర్ బిల్లుపై అసెంబ్లీలో, కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని చెప్పడం మైనారిటీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖ రాస్తానని చెప్పడం మంచి పరిణామం. మైనారిటీల భద్రతకు, రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన నిలుస్తోంది. ముస్లిం మైనారిటీలు భయపడాల్సిన పనిలేదు కుల, మత ప్రాతిపదికన చేసే చట్టాల అమలు సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలు ఎన్పీఆర్కు భయపడాల్సిన అవసరం లేదు. వారి సంపూర్ణ హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో దూరదృష్టితో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషనను కల్పించగా... నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మరింత మేలు చేసే దిశగా తప్పనిసరిగా పనిచేస్తారనే నమ్మకముంది’ బర్కత్ అలీ స్పష్టం చేశారు. -
ఎన్పీఆర్పై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి : జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎన్పీఆర్పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో స్పందించారు. ఎన్పీఆర్ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. Some of the questions proposed in the NPR are causing insecurities in the minds of minorities of my state. After elaborate consultations within our party, we have decided to request the Central Government to revert the conditions to those prevailing in 2010. (1/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2020 -
నేడు అమిత్ షా ఇంటికి.. షహీన్‌బాగ్ ర్యాలీ
-
నేడు అమిత్ షా ఇంటికి.. షహీన్‌బాగ్ ర్యాలీ
న్యూఢిల్లీ/కోల్‌కతా/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ షహీన్‌బాగ్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుకే ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ర్యాలీ మొదలుకానుంది. ర్యాలీపై తమకు సమాచారం లేదని హోంశాఖ తెలిపింది. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శనివారం షహీన్‌బాగ్ నిరసనకారులు కొందరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, బిర్యానీ కోసమే నిరసనలు.. షహీన్‌బాగ్‌లో నిరసనలు తెలుపుతున్న వారు డబ్బు, బిర్యానీల కోసమే రోజూ వేదిక వద్ద కూర్చుంటున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్‌ఘోష్ ఆరోపించారు. ‘నిరక్షరాస్యులు, సామాన్యులు, పేదలు, అజ్ఞానులు అక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. నేతలిచ్చే డబ్బు, బిర్యానీల కోసమే నిరసనలు చేస్తున్నారు. పైగా వీరికి పంపే డబ్బంతా విదేశాల నుంచే వస్తోంది. కాంగ్రెస్ నేత చిదంబరం, సీపీఐ నేత బృందా కారత్లాంటి వారి ప్రసంగాలు వినే శ్రోతలు వారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా శనివారం ముంబైలో భారీ ర్యాలీ జరిగింది. దీనికి వేలాది మంది హాజరు కాగా అందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఉర్దూ కవి ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ రచించిన ‘హమ్ దేఖేంగే’ (మేం చూస్తాం) అంటూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు ముంబైతో పాటు నవీ ముంబై, థానేల నుంచి తరలివచ్చారు. -
జన సంద్రమైన ‘ఆజాద్’ మైదాన్!
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను నిరసిస్తూ మహారాష్ట్రలో వేలాది మంది ఒక్కచోటకు చేరారు. ‘‘హమ్ దేఖేంగే’’ అంటూ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పద్యాల్లోని పంక్తులను ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ’’పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా, జాతీయ జనాభా పట్టిక జాతీయ వ్యతిరేక కూటమి’’ ... మహా-మోర్చా పేరిట ముంబైలోని చరిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది.(డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు) నవీ ముంబై, థానే తదితర ప్రాంతాలు, రాష్ట్రం నలుమూల నుంచి మైదానానికి చేరుకున్న నిరసనకారులు.. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబూని... ‘మోదీ, షా సే ఆజాదీ’ (మోదీ, షా నుంచి స్వాతంత్ర్యం కావాలి) అంటూ నినాదాలు చేశారు. ఇక మహిళా నిరసనకారులు..‘‘ఝాన్సీ రాణీ కుమార్తెలం’’ అంటూ ఆందోళనకు దిగారు. అదే విధంగా సీఏఏకు ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని.. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రిటైర్డు జడ్జి కోల్సే పాటిల్, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, నటుడు సుశాంత్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబూ అసీం అజ్మీ తదితర ప్రముఖులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. (అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా) ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం! ఎన్పీఆర్ అంటే ఏమిటి? -
ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం!
అగర్తలా: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)పై నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపుర రాష్ట్రం తాజాగా జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టికకు సంబంధించిన వివరాలను ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తామని త్రిపుర రాష్ట్ర జనాభా లెక్కల కార్యకలాపాల డైరెక్టరేట్ పీకే చక్రవర్తి శుక్రవారం తెలిపారు. ఎన్పీఆర్ డేటాను సేకరించటం కోసం 11 వేల మంది అధికారులను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి దశలో రాష్ట్రంలో ఉన్న ఇళ్ల జాబితాను తయారు చేసి.. గృహ గణన చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం మే 16 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. (మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్ట్) కాగా మొదటిదశ ఎన్‌పీర్ డేటా సేకరణ ఈ ఏడాది జూన్ 29 వరకు కొనసాగుతుందని పీకే చక్రవర్తి తెలిపారు. అదే విధంగా రెండో దశ ఎన్పీఆర్ డేటా సేకరణ కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎన్పీఆర్ డేటా సేకరణ ప్రక్రియ పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. డేటా సేకరణ కార్యక్రమంలో పాల్గొననున్న 11 వేల మంది అధికారుల్లో దాదాపు 9062 మంది జనాభా లెక్కల అధికారులు, 1556 మంది సూపర్వైజర్లు, తొమ్మిది మంది ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. పదహారు మాస్టర్ ట్రైనర్లు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు 169 మంది ఫీల్డ్ ట్రైనీలకు త్రిపుర రాజధాని అగర్తలలో శిక్షణ ఇస్తారని పీకే చక్రవర్తి తెలిపారు. (డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు) -
అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా
న్యూఢిల్లీ: తమ నేతలు చేసిన ‘గోలీ మారో’, ‘ఇండో పాక్ మ్యాచ్’ వంటి వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసి ఉండొచ్చని హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బీజేపీ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బావుండేదన్నారు. ‘టైమ్స్ నౌ’ వార్తా చానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని ఆయన అంగీకరించారు. అయితే, ఈ ఫలితాలను సీఏఏపై, ఎన్నార్సీపై ప్రజలిచ్చిన తీర్పుగా భావించకూడదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి ఎవరైనా తనతో చర్చించాలనుకుంటే.. అపాయింట్మెంట్ తీసుకుని తనను నేరుగా కలవవచ్చని షా తెలిపారు. అపాయింట్మెంట్ కోరిన మూడు రోజుల్లోగా వారికి సమయమిస్తామన్నారు. -
దూకుడు తగ్గించడమా? పెంచడమా?
కోల్‌కతా/న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో.. రానున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. గతంలో మాదిరిగానే పౌరసత్వ సవరణ చట్టం అమలు, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై దూకుడుగా వెళ్లాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహాలను తెరపైకి తేవాలా? అనే విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోవని తాజా ఢిల్లీ ఎన్నికలు స్పష్టం చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని భావించలేమని పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. వారు ఢిల్లీ ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఢిల్లీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. ‘ఢిల్లీలో కొన్ని నెలల వ్యవధిలోనే రెండు విభిన్న ఫలితాలు వచ్చాయి. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమాగా ఉండలేం’ అని వారు వివరించారు. ‘రాష్ట్ర ఎన్నికలకు వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది. జాతీయ ఎన్నికల్లో పనిచేసిన అంశాలు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు.సీఏఏ, ఎన్నార్సీల అమలుపైననే మా ప్రచారం ఉండకూడదు. సుపరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలనూ తెరపైకి తేవాలి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ వాదనకు విరుద్ధంగా మరో వాదనను మరి కొందరు నేతలు వినిపించారు. ‘సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి వ్యూహాలను మార్చాల్సిన అవసరం లేదు. వాటిపై దూకుడుగా ముందుకు వెళ్లడమే మంచిది. గతంలో అలా దూకుడుగా వెళ్లిన సందర్భంగా మంచి ఫలితాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. తృణమూల్ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే.. ఆవేశపూరిత, ఉద్వేగభరిత వ్యూహాలనే అమలు చేయాలి. ఒకవేళ వ్యూహాలను మారిస్తే వెనకడుగు వేసినట్లవుతుంది. ఇది పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సందేశం తీసుకువెళ్తుంది’ అని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు సన్నిహితులైన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడ్తున్నారు. ద్విముఖ పోరు వల్లనే ఓటమి ‘ఢిల్లీ’ పరాజయంపై బీజేపీ సమీక్ష ప్రారంభించింది. గతం కన్నా ఈ సారి ఓటు శాతం పెంచుకున్నప్పటికీ.. ద్విముఖ పోటీ నెలకొనడం వల్లనే ఓటమి పాలయినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 62 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 2015లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి ఆ సంఖ్యను కాస్త మెరుగుపర్చుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, పార్టీ దిగ్గజాలను ప్రచార బరిలో దింపినప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోవడంపై గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ వివాదాస్పద ట్వీట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాఖ పోస్టు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక ట్వీట్ వివాదాస్పదమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద మైనారిటీ మహిళలు బారులు తీరి తమ గుర్తింపు కార్డులను చూపిస్తూ ఉన్న ఒక వీడియోను కర్ణాటక బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘గుర్తింపు కార్డులు జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్లీ ఎన్పీఆర్ సర్వేలో చూపించాల్సి ఉంటుంది’ అని రాసి ఉంది. ఈ ట్వీట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: రచ్చరచ్చగా విజయ్ చిత్ర షూటింగ్) "Kaagaz Nahi Dikayenge Hum" ! ! ! Keep the documents safe, you will need to show them again during #NPR exercise.#DelhiPolls2020 pic.twitter.com/bEojjeKlwI — BJP Karnataka (@BJP4Karnataka) February 8, 2020 సీఏఏకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పుస్తకం కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాసిన ఓ పుస్తకం అమ్మకానికి పెట్టిన ఆరు రోజుల్లో 1,000 కాపీలు అమ్ముడుపోయింది. మమత రచించిన ‘నాగరికట్ట ఆతంకో’(పౌరసత్వ భయం) పుస్తకాన్ని అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనలో ఈ నెల 4న అమ్మకానికి ఉంచారు. ఈ పుస్తకంలో రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో భారత్‌లో అనిశ్చితి గురించి ఆమె రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమం, తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలను విశదీకరించారు. -
నిరసనలతో అరాచకం
న్యూఢిల్లీ: పార్లమెంటు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధుల్లో నిరసనలు, గృహదహనాలకు దిగితే చివరికి అది అరాచకత్వానికి దారి తీస్తుందని ప్రధాని మోదీ ఘాటుగా హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) వ్యతిరేక నిరసనల్ని విపక్షాలే రెచ్చగొడుతూ లేనిపోని భయాందోళనలను సృష్టిస్తున్నాయన్నారు. సీఏఏపై విపక్షాల వైఖరిని పాకిస్తాన్‌తో పోల్చారు. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో ముస్లింలపై పాక్ ఇదే విధంగా బురద జల్లిందన్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయ సభల్లోనూ జరిగిన చర్చకు మోదీ బదులిచ్చారు. లోక్‌సభలో గంటా 40 నిమిషాల సేపు మాట్లాడిన మోదీ సీఏఏ దేశ పౌరులపైనా, మైనార్టీల ప్రయోజనాలపైనా ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదని పునరుద్ఘాటించారు. రాజ్యసభలో ఎన్పీఆర్పై ఎక్కువగా మాట్లాడారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఉభయ సభలు ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించాయి. ఎన్పీఆర్కి సవరణలు చేపడితేనే నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. జన గణన, జనాభా పట్టిక సర్వసాధారణంగా జరిగే పరిపాలనాపరమైన ప్రక్రియ అని, ఇప్పుడే దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్న విపక్షాల దాడిని మోదీ తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ముస్లింలుగా చూస్తే, తాము వారిని భారతీయులుగా చూస్తున్నామని చెప్పారు. చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం దేశ ప్రజలు తమ అయిదేళ్ల పని తీరు చూశాక బీజేపీపై నమ్మకం ఉంచి అధికారాన్ని తిరిగి అప్పగించారన్నారు. అందుకే పాలనలో వేగవంతం, విస్తృతి పెంచడం , సమస్యల్ని పరిష్కరించడం, నిబద్ధతతో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని మోదీ చెప్పారు. పాత విధానాలతో ముందుకు వెళితే ఆర్టికల్ 370 రద్దు అయ్యేది కాదని, ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌తో బాధల్లోనే ఉండేవారని అన్నారు. ఇంకా పాత ఆలోచనలే చేస్తే రామజన్మభూమి వివాదమూ పరిష్కారమయ్యేది కాదు, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ సాకారమయ్యేది కాదు, భారత్, బంగ్లాదేశ్ మధ్య భూ ఒప్పందం కుదిరేది కాదని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆర్థిక లోటును నియంత్రిస్తున్నాం ఆర్థిక లోటును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ధరల పెరుగుదలను నియంత్రిస్తున్నామని మోదీ చెప్పారు. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. మేకిన్ ఇండియాపై విదేశాలకు నమ్మకం కుదిరి ఎఫ్‌డీఐలు బాగా పెరిగాయన్నారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు ఎక్కువ చేశామని రూ. 27 వేల కోట్లు ఉన్నదానిని ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లు చేశామన్నారు. ఈశాన్యంలో అభివృద్ధి నిత్యం రక్తపాతం, హింసతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రా ల్లో వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశామన్నారు. బోడో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా శాంతి స్థాపన జరుగుతోందని, పెట్టుబడులకు మార్గం సుగమం అయిందన్నారు. గాంధీ మాకు జీవితం ప్రధాని మోదీ లోక్‌సభ ఆవరణలోకి రాగానే బీజేపీ సభ్యులు జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేస్తే, దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ సభ్యులు మహాత్మా గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు. సభలో మోదీ ప్రసంగం మొదలు కాగానే కాంగ్రెస్ సభ్యులు మహాత్ముడిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇది ట్రయలర్ మాత్రమే అంటూ వ్యంగ్యబాణాలు విసిరారు. దీంతో మోదీ ఆయనకి చురకలంటించారు. ‘మీకు మహాత్మాగాంధీ ట్రయలర్ కావొచ్చు.. మాకు గాంధీయే జీవితం’ అంటూ బదులిచ్చారు. రాహుల్ ట్యూబ్‌లైట్ తన ప్రసంగానికి విపక్షాలు అడ్డు తగిలినప్పుడల్లా మోదీ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మధ్యలో రాహుల్ లేచి ఉద్యోగాల గురించి ప్రస్తావించగానే, తాను మాట్లాడటం మొదలు పెట్టిన 40 నిమిషాల తర్వాత స్పందించడంతో రాహుల్‌ని ట్యూబ్‌లైట్ అంటూ ఎదురు దాడికి దిగారు. ఆరు నెలల్లో యువత మోదీ వీపుని కర్రలతో వాయిస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారని వచ్చిన వార్తల్ని ప్రధాని ప్రస్తావించారు. రాహుల్ పేరు చెప్పకుండా.. ‘ప్రతిపక్ష ఎంపీ ఒకరు యువత నా వీపుని విమానం మోత మోగిస్తామని అన్నారట. అందుకే మరింత సమయం సూర్యనమస్కారాలకు సమయం కేటాయిస్తా. అప్పుడు ఎలాంటి దూషణలనైనా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. గీత గీసింది నెహ్రూయే సీఏఏని సమర్థించుకునే క్రమంలో తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని ఉదహరించారు. దేశ విభజన తర్వాత సరిహద్దుల నుంచి మన దేశంలోకి వచ్చిన వారిని హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులుగా నెహ్రూయే విభజించి చూశారని మోదీ తెలిపారు. నాటి అస్సాం సీఎం గోపీనాథ్ బర్దోలియాకి నెహ్రూ రాసిన లేఖలో అంశాలను మోదీ ప్రస్తావించారు. పాక్ నుంచి భారత్‌కొచ్చిన వారిలో హిందూ శరణార్థులకు, ముస్లిం వలసదారులకు మధ్య తేడా చూపాలని, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వచ్చే మైనార్టీలను భారత్ కాపాడాలని లేఖలో ఉందన్నారు. అవసరమైతే హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా చట్టానికి సవరణలు చేద్దామని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ చెప్పారు. మరి అలా మాట్లాడిన నెహ్రూ మతవాదా? ఆయన హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు ‘నెహ్రూ నాటి పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో పౌరులందరినీ చేర్చకుండా, మైనార్టీల ప్రయోజనాలను ఇరుదేశాల్లో కాపాడాలని ఎందుకు అంగీకారానికి వచ్చారని నిలదీశారు. ఏపీ విభజనను ప్రజలు మర్చిపోరు పౌరసత్వ చట్టం సవరణలపైగానీ ఆర్టికల్ 370 రద్దు సమయంలో గానీ తమతో ఎలాంటి చర్చ జరపకుండానే ప్రభుత్వం ముందుకెళ్లిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ప్రధాని స్పందిస్తూ.. ‘ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిపై సవివరమైన చర్చ జరిగిన విషయం యావత్తు జాతికి తెలుసు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా సభ్యులు ఓటు వేశారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2014లో యూపీఏ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించారు. ‘ప్రజలు అంత తేలిగ్గా ఏదీ మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతకు గుర్తు చేస్తున్నా. ఆ సమయంలో సభను దిగ్బంధంలో ఉంచారు. టీవీల్లో సభా కార్యకలాపాల ప్రసారాలు నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ విభజనను హడావుడిగా ప్రకటించారు’ అని తెలిపారు. నిరుద్యోగంపై మాట్లాడరా?: రాహుల్ దేశం ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన నిరుద్యోగ సమస్య ప్రధాని మోదీకి కనిపించలేదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నెహ్రూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంశాలను లేవనెత్తి మోదీయే ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అయిదున్నరేళ్లు గడిచిపోతున్నా ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. వంద నిమిషాల సేపు మాట్లాడిన ప్రధానికి గత ఏడాది కోటి మంది యువత ఉద్యోగాలు కోల్పోతే దానిపై మాట్లాడడానికి సమయం దొరకలేదా అని రాహుల్ ప్రశ్నించారు. -
అమ్మానాన్న రుజువులు తేవాలా?
మనది చాలా గొప్ప ప్రగతి. 70వ రిపబ్లిక్ డే నుంచి మనం ఆల్ ఫూల్స్ డేకు ప్రగతి చెందబోతున్నాం. సరిగ్గా ఏప్రిల్ 1, 2020న జనులు సిద్ధంగా ఉండాలి తమ తమ వివరాలతో, తమ నివాసాలకు రుజువులతో. అమ్మానాన్నల పుట్టుపూర్వోత్తరాలు చెప్పి రుజువులు కూడా తేవాలని మహా ఘనత వహించిన సర్కారు వారు ఆదేశిస్తున్నారు. భారత సంవిధానం పూర్తిస్థాయి అమలు ప్రారంభమై 70 ఏళ్లు గడిచిన తరువాత అప్పటినుంచి బతికి ఉన్న వృద్ధులు కూడా తాము పౌరులమే అని రుజువు చేసుకోవాలి. ఒక వేళ వారు గతించి ఉంటే వారి తనయులు, తమ తల్లిదండ్రులు జనన స్థలం, జనన తేదీలను రూఢిగా అధికారులకు తెలియజేయాలి. ముందు జనపట్టిక కోసం అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పని ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ చివరిదాకా జరుగుతుందని ఎప్పుడో నోటిఫై చేశారు. జనపట్టిక వివరాల్లో తప్పులకు జరిమానాలు ఉంటాయి. అంతకన్న పెద్ద ప్రమాదం ఏమంటే వివరాలు ఇవ్వకపోయినా, రుజువులు చూపకపోయినా పౌరసత్వానికి అనుమానపు ఎసరు వస్తుంది. నిజానికి 2011 నుంచే జనపట్టిక నమోదుకోసం ఎన్పీఆర్ కార్యక్రమం మొదలైంది. అప్పుడు 15 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలన్నారు. దీన్ని 2015లో కొంత మార్చారు. 2019లో ఆరు కొత్త ప్రశ్నలు చేర్చారు. ఆ ఆరు ప్రశ్నల్లో నాలుగు చాలా ఇబ్బందికరమైనవి, అవి 1. తండ్రి పుట్టిన తేదీ, 2. తండ్రిపుట్టిన చోటు, 3. తల్లి పుట్టిన తేదీ, 4. తల్లి పుట్టిన చోటు వివరాలు. 5. ఆధార్ వివరాలు, 6. చదువు వివరాలు. తల్లిదండ్రుల పుట్టుక తేదీ, పుట్టిన చోటు తెలుసుకోవడం, వాటికి రుజువులు కనుక్కోవడం కోట్లాది మంది ప్రజలకు సాధ్యం కాదు. పత్రాలు లేకపోతే ప్రత్యక్ష సాక్షులను తేవొచ్చు అంటున్నారు. ఇది మరొక వింత. తండ్రి పుట్టిన నాడు చూసిన లేదా తెలిసిన సాక్షులు బతికి ఉంటారనీ, ఒకవేళ ఉన్నా వారు ఈనాటికీ సాక్ష్యం చెప్పడానికి వస్తారనుకోవడం అసాధ్యం. ఇప్పుడు బతికున్న మనమంతా మన పుట్టిన చోటు, తేదీ రుజువు చేసుకోవడం సాధ్యం అవుతుందేమో గాని, తల్లిదండ్రులు (ఉన్నప్పటికీ) వారి పుట్టుక తేదీ, చోటు ఏ విధంగా రుజువుచేయాలనేది సమస్య. చాలామందికి సొంత జనన ధ్రువపత్రాలే ఉండని సమాజం మనది. బడిలో ఆరోతరగతిలో చేరడానికి మన ముందు తరాల వారు వెళ్తే ఆ బడిలో పనిచేసే గుమస్తాలు, చాలామందికి జూలై ఒకటిని పుట్టిన తేదీగా నమోదు చేసేవారు. ఇప్పుడు 70, 80 ఏళ్ల వయసున్న పెద్దలందరికీ ఇటువంటి కలి్పత పుట్టిన తేదీలే ఉంటాయి. ఇదీ పొంచి ఉన్న ప్రమాదం. జన పట్టిక వివరాలలో అనుమానం వస్తే స్థానిక రెవెన్యూ అధికారులకు విపరీతమైన అధికారాలు వస్తాయి. తండ్రి, తల్లి పుట్టిన తేదీ, చోటు రుజువు చేయలేకపోతే వారి పేరు పక్కన ’డి‘ అని రాస్తారు. తరువాత మరింత పరిశీలన జరుపుతారు. అప్పుడు ఆ వ్యక్తి తన కేసు చెప్పుకోవచ్చు. ఆ తరువాత అనుమానం తీరినట్టు అధికారి భావిస్తే ప్రమాదమే లేదు. అతనికి పౌర ధ్రువపత్రం లభిస్తుంది. లేకపోతే అతను పౌరుడు కాడంటూ కేసును ఫారినర్స్ ట్రిబ్యునల్‌కు పంపిస్తారు. అక్కడ సిటిజన్‌షిప్ చట్టం 1955కు 2019లో చేసిన సవరణ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. అనుమానం స్థిరపడితే ఇన్నాళ్లూ ఇక్కడ భారతీయుడైన వ్యక్తి హఠా త్తుగా పరాయి వాడవుతాడు. తన సొంత దేశానికి పంపే దాకా డిటెన్షన్ సెంటర్లో బంధి స్తారు. ఈ దేశం వాడికి ఇంకే సొంత దేశం ఉంటుంది? అంటే ఏ దేశానికీ చెందని వాడుగా మారిపోతే అతని గతి ఏమిటి? ఎన్నాళ్లు జైల్లో ఉంటాడు? వారి సంతతి ఏమవుతారు? ఇంత దారుణమైన పరిణామాలు ఉంటాయి. జనపట్టిక అనే పేరుతో మన జాతీయతకు, దేశీయతకు, పౌరసత్వానికే ఎసరు పెట్టడం గురించి గమనించాలి. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు. ప్రతి వ్యక్తి భారతీయతకు సంబంధించిన సమస్య. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పౌరసత్వ చట్టంపై ఈయూలో ఓటింగ్ వాయిదా
లండన్: మోదీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు సీఏఏపై చర్చ కోరుతూ దాఖలు చేసిన ఐదు తీర్మానాలను కలిపి ఒకటిగా చేసి, బ్రసెల్స్‌లో జరుగుతున్న ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని బుధవారం సమావేశాల తుది ఎజెండాలో చేర్చారు. చర్చ అనంతరం గురువారం జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేశారు. ఓటింగ్ మార్చి నెలలో జరిగే సమావేశాల్లో నిర్వహిస్తామని యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. సీఏఏపై చర్చను మాత్రం ఇప్పుడు కొనసాగించి, ఓటింగ్‌ను మార్చికి వాయిదా వేయాలన్న సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. భారత్ వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ వాయిదా పడిందని, ఇది భారత ప్రభుత్వ దౌత్య విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. ఒక రాజ్యాంగబద్ధసంస్థ చేసిన చట్టంపై మరో రాజ్యాంగబద్ధ సంస్థ తీర్పునివ్వడం సరికాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడికి లేఖ రాశారు. యూరోపియన్ పార్లమెంట్లో పాకిస్తాన్ మిత్రుల వాదనపై భారత మిత్రుల వాదనే నెగ్గిందని భారత ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఏఏ వివక్షాపూరితమని, ఆ చట్టంలోని వివాదాస్పద సవరణలను భారత్ వెనక్కు తీసుకోవాలని గత నెలలో ఐరాస మానవహక్కుల విభాగం ‘యూఎన్‌హెచ్‌సీఆర్’ చేసిన వ్యాఖ్యను ఈయూ పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంది. బెగ్జిట్కు ఆమోదం యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బుధవారం యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అమెరికాలో.. సీఏఏ, ఎన్నార్సీలు అమెరికా ప్రతినిధులసభలో మరోమారు చర్చనీయాంశంగా మారాయి. సీఏఏ, ఎన్నార్సీలు మతపరమైన హింసకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు విచారణ సందర్భంగా సభకు వివరించారు. అంతర్జాతీయ మానవహక్కుల ఉపసంఘాలూ, గ్లోబల్ హెల్త్ ఉపసంఘాలూ, సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్‌సబ్ కమిటీలూ, ఆఫ్రికా విదేశాంగ వ్యవహారాల కమిటీలు ఈ విచారణను చేపట్టాయి. -
ప్రశాంత్ కిషోర్‌పై జేడీయూ వేటు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తున్న కిషోర్... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నితీశ్ మళ్లీ సీఎం కావాలి: ప్రశాంత్ బహిష్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు నితీశ్‌జీ. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. దానిపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహిస్తూ... ‘‘ఎంత దిగజారిపోయారు!!. ఇలాంటి అబద్ధం చెప్పి నన్నూ మీ స్థాయికి లాగుతున్నారా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అమిత్ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. తృణమూల్‌లో చేరనున్నారా? ప్రశాంత్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తోంది. కానీ ఈ వార్తను తృణమూల్ వర్గాలు నిర్ధారించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ పేర్కొన్నారు. మమత బెనర్జీతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్ సేవలను టీఎంసీ ఉపయోగించుకుంటోంది. -
ఇంతకూ ఎన్ఆర్సీకి చట్టబద్ధత ఉందా !?
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేటికీ ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్–జాతీయ పౌరుల పట్టిక)కి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్సీ పట్ల ప్రజలు అపోహలు పెట్టుకొని అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎన్ఆర్సీ అంటే ఏమిటో, అది ఎందుకో అటు ఆందోళనలు చేస్తున్న ప్రజలకుగానీ, వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పెద్దలకుగానీ సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్ఆర్సీగా వ్యవహరిస్తున్న జాతీయ జనాభా లెక్కలను గతంలో ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషనల్ ఆఫ్ రిజిస్టర్–జాతీయ జనాభా పట్టిక) అని వ్యవహరించేవారు. దేశ జనాభాను లెక్కించడంతోపాటు దేశంలోని పలు సామాజిక వర్గాల అభ్యున్నతిని అంచనా వేసేందుకు పదేళ్లకోసారి ఈ జనగణను నిర్వహిస్తారు. క్రితం సారి 2011లో నిర్వహించిన జన గణనకు 2010లోనే కసరత్తు ప్రారంభం కాగా, 2021లో నిర్వహించేందుకు 2019, డిసెంబర్లోనే మోదీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్ఆర్సీకి ఎన్పీఆర్కి తేడా ఏమిటీ? ఎన్పీఆర్లోలేని ఎనిమిది కొత్త అంశాలను ఎన్ఆర్సీలో చేర్చారు. అందులో ఒకటి తల్లిదండ్రులు పుట్టిన స్థలం, పుట్టిన తేదీ–సంవత్సరం, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఓటరు ఐడీ కార్డు నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పౌరుడి మాతృ భాష. ఓ మతాన్ని లక్ష్యంగా పెట్టుకొనే ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారని, రేషన్ కార్డుకు లింకైన ఆధార్ కార్డు బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి ముందుగా ఓ మతస్తులకు రేషన్ రద్దు చేస్తారని, ఆ తర్వాత శాశ్వతంగా వారిని దేశం నుంచి బహిష్కరిస్తారన్నది ఆందోళనకారుల వాదన. పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎన్ఆర్సీకి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటం కూడా ఓ వర్గం ప్రజల ఆందోళనలను పెంచింది. ‘ఆధార్ నెంబర్ చెప్పడం, చెప్పక పోవడం పౌరుడి చిత్తం (ఐచ్ఛికం)’ అని డిసెంబర్ 24వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఎన్ఆర్సీలోని అన్ని అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించాల్సినవేనని అదే రోజు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక ‘ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ వెల్లడించడం తప్పనిసరని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు జనవరి 16వ తేదీన మీడియాకు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పుట్టిన స్థలం వెల్లడించడం పౌరుడి ఐచ్ఛికమంటూ జనవరి17వ తేదీన అదే శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు. అవును, అది నిజమేనంటూ జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు. ఒక్క ఆధార్ నెంబర్ మినహా మిగతా అన్ని వివరాలను వెల్లడించడం పౌరులకే శ్రేయస్కరమన్న విషయాన్ని ఎన్యూమరేటర్లు వారితో ఒప్పించాలంటూ ‘ఎన్ఆర్సీ ట్రైనింగ్ మాన్యువల్’ తెలియజేస్తోంది. ప్రభుత్వంలోనే ఇంత గందరగోళం ఉందంటే ఇంక ప్రజల్లో ఎంత గందరగోళం ఉంటుంది? అసలు చట్టబద్ధతే లేదు అసలు ఎన్ఆర్సీలో కొత్తగా చేర్చిన ఎనిమిది అంశాలకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధత ఇప్పటి వరకు లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎన్పీఆర్కు సంబంధించి 2003లో అప్పటి అటల్ బిహారి వాజపేయ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘పౌరసత్వ నిబంధనలు’ తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల సంఖ్య, పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం ప్రతిపౌరుడి బాధ్యతని, తప్పుడు వివరాలను వెల్లడించినట్లయితే అందుకు కుటుంబం పెద్ద బాధ్యత వహించాల్సి ఉంటుందని, దానికి జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆ చట్టం తెలియజేస్తోంది. ఐచ్చికం అన్న పదం అందులో ఎక్కడా లేదు. ఆ చట్టం ప్రకారం పౌరుడి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, శాశ్వత, ప్రస్తుత చిరునామా, పుట్టుమచ్చ, పౌరసత్వ నమోదు తేదీ, సీరియల్ నెంబర్, జాతీయ గుర్తింపు నెంబర్‌ను కోరారు. కొత్త అంశాలకు కూడా చట్టబద్ధత రావాలంటే ‘2003 పౌరసత్వ చట్టం’ను సవరించక తప్పదు. -
అలా ఆదేశాలివ్వలేం..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై అధికారులు జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించకుండా ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని ముందస్తుగా ప్లాన్ వేసుకుని చేసే అవకాశం ఉందని, అలాంటప్పుడు అధికారులకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఎన్ఎస్ఏ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలు, ఢిల్లీలో ఎన్ఎస్ఏ ప్రయోగించకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒకవేళ ఆదేశిస్తే.. వ్యవస్థ గందరగోళంగా తయారవుతుందని అభిప్రాయపడింది. హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోండి సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలు, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటం పేరుతో హింసకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని 154 మంది ప్రముఖులతో కూడిన బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. కొన్ని రాజకీయ శక్తులు హింసాయుత నిరసనకారులకు సహాయం చేస్తున్నారని బృందానికి నేతృత్వం వహించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ జస్టిస్ పెర్మాడ్ కోహ్లి ఆరోపించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తుల పట్ల ఆందోళనచెందుతున్నామన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంపై 11 మంది హైకోర్టు జడ్జిలు, 72 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 56 మంది రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారులు, మేధావులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు సంతకాలు చేశారు. -
ఎన్పీఆర్లో వివరాలు స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)కు సంబంధించి ప్రజలు అందించాల్సిన సమాచారం తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. జనాభా రిజిస్టర్ సమయంలో ప్రజల వ్యక్తిగత సమాచారం వెల్లడించాల్సి ఉండటంపై కొన్ని బీజేపీయేతర పాలనా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఎన్పీఆర్కి ఇవ్వాల్సిన సమాచారం ఎవరైనా స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చునని, అది నిర్బంధం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే 2010లో ఎన్పీఆర్ ప్రారంభించిందని, రాజ్యాంగపరంగా విధిగా ఈ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియను నిర్వహించబోమని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడానికి వీల్లేదన్నారు. 2021 ఏప్రిల్‌లో జాతీయ జనాభా గణనకు ముందు జరిగే ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. ఎన్పీఆర్ ఫామ్‌లో పుట్టిన వివరాలు, తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ వంటివి ఉండటంతో ఎన్సార్సీకి ముందు జరిగే తతంగమేనంటూ ఈశాన్య రాష్ట్రాలు, బీజేపీయేత పాలనా రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కేరళ వంటి రాష్ట్రాలు జనాభా గణనకు సహకరిస్తామే తప్ప ఎన్పీఆర్కు అంగీకరించబోమని తేల్చి చెప్పేశాయి. ఇక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రం ప్రజలతో ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ధ్వజమెత్తారు. ఎన్పీఆర్ చుట్టూ వివాదం నెలకొనడంతో కేంద్రం ‘‘ఎన్పీఆర్లో సమాచారం వెల్లడి స్వచ్ఛందం మాత్రమే’’అని ప్రకటన చేయాల్సి వచ్చింది. అప్పట్లో మాట్లాడలేదేం ? రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియపై విపక్షాలు రచ్చ చేయడాన్ని కిషన్‌రెడ్డి తప్పు పట్టారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇంటింటికీ తిరిగి వారి వివరాలు, బ్యాంకు అకౌంట్లు, మెడికల్ హిస్టరీ వంటి ఎన్నో ప్రశ్నలు అడిగినా ఎవరూ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. అప్పట్లో అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా ఎలాంటి ప్రశ్నలు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఎన్పీఆర్పై వివాదం రాజకీయ దురుద్దేశపూరితమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్పీఆర్ అంటే.. దేశంలో నివసించే ప్రజల వివరాలను తెలుసుకొని, వారికి జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వడమే జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఉద్దేశం. పౌరసత్వ చట్టం 1955, జాతీయ గుర్తింపు కార్డుల జారీ నిబంధనలు, 2003 ప్రకారం ఈ పట్టికలో డేటాను గ్రామాలు, ఉప జిల్లాలు, జిల్లాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. ఆరు నెలల నుంచి ఒక ప్రాంతంలో స్థిరనివాసం ఉన్నవారు, మరో ఆరు నెలలు ఆదే ప్రాంతంలో ఉండాలని అనుకుంటున్న వారి నుంచి వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా గణనకు ముందు ఏడాది 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్పీఆర్ డేటాని సేకరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో ఇంటింటికీ తిరిగి ఈ పట్టికను సవరించారు. ఆ సమయంలో ప్రజల నుంచి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్లు అడిగి తెలుసుకున్నారు. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ కార్డు వివరాలు అడిగే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియలో పాన్ వివరాలతో పని ఉండదు. -
ఆర్బీఐ ద్వారా ఎన్పీఆర్
ముంబై: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అప్‌గ్రెడేషన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా లేదు. 2015 నాటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి, తాజాగా బ్యాంకుల ద్వారా వివరాలను సేకరించేందుకు యోచిస్తోంది. మనీల్యాండరింగ్ నిబంధనలు–2005ను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం 2015 జూలై 7వ తేదీన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి ఒక సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారుల నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాలతోపాటు ‘నో యువర్ కస్టమర్’ వివరాల్లో భాగంగా ఎన్పీఆర్ను సేకరించాలని అందులో సూచించింది. కారణాలు వెల్లడి కానప్పటికీ, మూడేళ్ల తర్వాత ఆర్బీఐ 2018 ఏప్రిల్‌లో కేవైసీలో ఎన్పీఆర్ను భాగంగా మార్చుతూ ఆదేశాలిచ్చింది. అయితే, ఈ నెల 9వ తేదీన దీనిని ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయింది. ‘బ్యాంకింగ్ కార్యకలాపాలు, కొత్త అకౌంట్లకు ఈ వివరాలు తీసుకోవాలన్న ఆర్బీఐ సూచనలను అమలు చేస్తున్నాం. కొందరు భావిస్తున్నట్లుగా ఎన్పీఆర్ వివరాలివ్వడం తప్పనిసరి మాత్రం కాదు’అని ఆర్బీఐ ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. కాగా, కేరళ ప్రభుత్వం ఎన్పీఆర్ విషయంలోనూ కేంద్రంతో విభేదిస్తోంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని అమలు చేయబోమని కేంద్రానికి తెలపాలని సీఎం విజయన్ నేతృత్వంలో కేబినెట్ భేటీ నిర్ణయించింది. ఎన్సార్సీని అమలు చేయబోమంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. -
సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకుగాను శనివారం కోల్‌కతా వచ్చిన మోదీతో రాజ్‌భవన్‌లో మమత సమావేశమయ్యారు. అనంతరం మమత నేరుగా టీఎంసీ చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని వచ్చిన సమయంలో కోల్‌కతా విమానాశ్రయం వెలుపల, మార్గమధ్యంలోని ఫ్లై ఓవర్ వద్ద జాతీయ పతాకాలు, నల్ల జెండాలతో ఆందోళనకారులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వామపక్ష సంఘాల కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనల నేపథ్యంలో నగరంలోని కీలకప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. సీఏఏ వెనక్కి తీసుకోవాలని కోరా ‘ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన రూ.28 వేల కోట్ల ఆర్థిక సాయం గురించి ప్రధానితో చర్చించాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు తెలిపాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు మేం వ్యతిరేకమని చెప్పాను. ఈ విషయంలో కేంద్రం కూడా పునరాలోచన చేయాలని, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కోరాను. సామాన్యులపై వివక్ష, వారిని వేరుగా చూడటం, వేధించ డం తగదని చెప్పా’ అని మమత అన్నారు. ‘ఢిల్లీకి వస్తే చర్చిద్దాం’ అని అన్నారని మమత చెప్పారు. బేలూరు మఠంలో ప్రధాని బస మోదీ శని, ఆదివారాల్లో జరిగే కోల్‌కతా పోర్ట్ 150వ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానితోపాటు గవర్నర్ ధన్కర్, సీఎం మమత ఒకే వేదికపై కనిపించనున్నారు. శనివారం రాత్రి ఆయన హౌరా జిల్లాలో ఉన్న రామకృష్ణ మిషన్ ప్రధానకార్యాలయం బేలూర్ మఠంలో బస చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తదితర ప్రముఖులు ఎందరో ఈ మఠాన్ని గతంలో పలుమార్లు సందర్శించినప్పటికీ ఎవరూ కూడా అక్కడ బస చేయలేదని మఠం అధికారులు తెలిపారు. మమతకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ధర్నా జరుగుతుండగా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. మోదీతో భేటీపై మమతా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీతో భేటీ.. ఆ వెంటనే ధర్నా.. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం మమత నేరుగా అక్కడికి సమీపంలోనే టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. సీఏఏ అమలుపై హోం శాఖ జారీ చేసిన గెజిట్‌పై ఆ ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఏఏ చట్టం కాగితాలపైనే ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’అని తెలిపారు. -
జనగణనలో మొబైల్ నంబర్!
న్యూఢిల్లీ: జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్‌ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్‌పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. -
సైనిక ‘రాజకీయం’ ప్రమాదకరం
సైన్యం నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు జాతీయ భద్రతా విధానం సర్వసమ్మతంగా అమలవుతుందని విశ్వసించటం కష్టం. రాజకీయాలకు, మతానికి, జెండర్‌కు, కులానికి, జాతి వివక్షకు అతీతంగా ఉంటూండటమే భారతీయ సైన్యం నిజమైన బలం. దేశ ప్రజలు సైన్యంపై అంతటి విశ్వాసాన్ని, ఆరాధనను ప్రదర్శించడానికి ఇదే కారణం. ఉన్నత స్థానాల్లోని సైన్యాధికారులు ఈ దృక్పథాన్ని, సైనిక జీవితాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో కొందరు సీనియర్ సైనికాధికారులు ఈ సూత్రాన్ని వదిలివేశారు. ఉన్నత ర్యాంకు కోసం తపిస్తూ, సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సైనిక వారసత్వ మనస్తత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది సైన్యం నైతిక ధృతికి అవరోధంగా మారుతుంది. యావత్ సైనిక బలగాలపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) సంబంధించిన తీవ్ర వివాదం మధ్య భారతదేశం ప్రస్తుతం చిక్కుకుపోయి ఉంది. అదే సమయంలో జాతీయ జనగణన నమోదు (ఎన్పీఆర్), అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియను ఖరారు చేయడానికి సంబంధించిన వార్తల్ని ప్రచారంలో పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తమ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న కొన్ని దేశాల సరసన భారత్ కూడా చేరడం విచారకరం. ఆఫ్రికా, యూరోప్, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా.. ఇలా ప్రపంచమంతటా ఇలాంటి ధోరణులు పొడసూపుతుండటం తెలిసిందే. ప్రజాందోళనలకు విభిన్న కారణాలు ఉండవచ్చు కానీ పాలకవర్గాలు తమ విధానాలను మార్చుకోవడంలో, పునరాలోచన చేయడంలో మొండివైఖరిని ప్రదర్శించడం అనే ఉమ్మడి లక్షణమే ఈ ఆందోళనలకు భూమిక. అయితే కొన్ని దేశాలు తమ ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని విధానాల్లో కొన్ని సవరణలను చేసుకుంటున్నాయి కానీ భారత ప్రభుత్వం మాత్రం ప్రజల డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గుతున్నట్లు కనిపించనందునే ప్రజాందోళనలపై, హింసాత్మక చర్యలపై భద్రతా బలగాల అణచివేత కొనసాగుతున్నాయి. బహుశా, పార్లమెంటులో అఖండ మెజారిటీ వల్లే పాలక పార్టీ తన సిద్ధాంతాలను ఎలాగైనా సరే ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నట్లుంది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం లభించడంతో తన విధానాలను ఏకపక్షంగా అమలు చేయాలని పాలకపక్షం సిద్ధమైంది. చాలా సందర్భాల్లో సంఖ్యాబలంలో చిన్నదిగా ఉన్న ప్రతిపక్షం అభిప్రాయాలను పెద్దగా లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనగణన ప్రాతిపదికన జరుగుతుందనే అంశంపై కేంద్రప్రభుత్వం పరస్పర విభిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నట్లు ఇటీవలి నివేదిక సూచిస్తోంది. ఎన్నార్సీకి అనుగుణంగానే ఎన్పీఆర్ ఉంటుందని రాజకీయ నేతలు ప్రకటిస్తుండగా ఎన్పీఆర్ తొలిదశగా ఉంటుందని ఎమ్హెచ్ఏ వార్షిక నివేదిక చెబుతోంది. ఇలా ప్రభుత్వ పక్షాన మారుతున్న విధానాలు ఆందోళనకారులకు హామీ ఇవ్వకపోగా, ప్రతికూల ప్రభావాలకు దారితీసి విశ్వాస భంగం కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఎదురుదాడి మొదలెట్టేసింది. తనకు తోడుగా ప్రాంతీయ, రాష్ట్ర పార్టీలను సమీకరిస్తోంది. ఈ విధాన సూత్రీకరణల ద్వారా తమ పౌరసత్వం ఎక్కడ పోతుందో అని ఏ భారతీయ పౌరులూ భయపడాల్సిన పనిలేదని హామీ ఇస్తోంది. రాజకీయ పార్టీల దృక్పథాలు విభిన్నంగా ఉండటంతో ప్రజల్లో విశ్వాసరాహిత్యం ప్రబలుతోంది. ఈ పరిస్థితిపై సాయుధబలగాలకు ఎలాంటి పాత్ర ఉండకూడదు. ఎందుకంటే సైన్యం పాత్ర, వారి కార్యాచరణ పక్కాగా నిర్వచించబడి ఉంది. రాజకీయ విన్యాసాలు రాజకీయ నేతలకు, పార్టీలకు మాత్రమే సంబంధించినవి కానీ సాయుధ బలగాలకు కాదు. 72 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మనం అనేక రాజకీయ పార్టీలు పాలించడం చూశాం. కానీ, ఒక విషయంలో మాత్రం ఇవి రెండు ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. ప్రజల డిమాండ్లను వింటాయి. తర్వాత వాటిని సవరిస్తాయి, నిర్లక్ష్యం చేస్తాయి, వదిలివేస్తాయి, అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా గతంలో ఇలాగే చేసింది. కానీ ఇటీవలికాలంలో ప్రజానుకూల చర్యలను ప్రధాన ఎన్నికలకు ముందు మాత్రమే ప్రకటించడం పార్టీలకు అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు మన సైనిక బలగాల విషయానికి వద్దాం. భారత సైన్యం లౌకికత్వానికి చెందిన ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి రాజకీయ పోరాటాలపై ఎలాంటి వైఖరి తీసుకోకూడదని రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రీకరణలను తు.చ. తప్పకుండా గౌరవిస్తుంటాయి. సైన్యం ఉదాహరణను విస్తరించి చూసినట్లయితే, వాయుసేన, నావికాబలగానికి చెందిన కమాండింగ్ ఆఫీసర్లకు చెందిన వివిధ స్థాయిల అధికారులు కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటాయి. వీరు మతపరమైన, లైంగికపరమైన ఎలాంటి వివక్షను పాటించరు. అలాగే కులాన్ని చూడరు, జాతి వివక్షను ప్రదర్శించరు. ఇదే మన సైన్యం బలం. భారత ప్రజలు సైన్యంపై అంతటి విశ్వాసాన్ని, అంత ఆరాధనను ప్రదర్శించడానికి ఇదే కారణం. ఉన్నత స్థానాల్లోని సైనికాధికారులు ఈ దృక్పథాన్ని, సైనిక జీవితాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో సీనియర్ సైనికాధికారులు ఈ సూత్రాన్ని వదిలివేశారు, పలుచన చేశారు కూడా. ఉన్నత ర్యాంకు కోసం తపిస్తూ, భౌతిక ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సైనిక వారసత్వపు మనస్తత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా సైనిక నైతిక ధృతికి, ప్రత్యేకించి సైనిక శిక్షణలో పెరిగిన జీవన దృక్పథానికి ఇవి అవరోధాలుగా మారుతున్నాయి. అత్యంత దయనీయమైన విషయం ఏమిటంటే, యావత్ సైనిక బలగాలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. సాధారణ ప్రజలకు సంబంధించినంతవరకు సొంత ప్రయోజనాల కంటే సైనికులు, వారి అధికారులు ప్రదర్శించే సేవా భావాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సమాచార యుగంలో దేశంలో ఏం జరుగుతోంది, వివిధ రాజకీయ పార్టీల రాజకీయ విన్యాసాలు ఎలా ఉంటున్నదీ సైనికులకు పూర్తి అవగాహన ఉంటోంది. అధికారం నిలుపుకోవడానికి, ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీలు ఏమేం చేస్తున్నది కూడా ఇప్పుడు సైన్యానికి బాగానే తెలుసు. ఈ నేపథ్యంలో పక్షపాత రాజకీయ వైఖరిని స్పష్టంగా ప్రదర్శిస్తున్న ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి విశ్వాసం ప్రకటించేలా సైన్యంలో కొందరు సీనియర్ అధికార్లు రాజకీయ ప్రభావాలకు గురవుతోందనిపిస్తోంది. రాజకీయాలకు అతీతమైన, పాక్షిక దృక్పథం లేని సైన్యం భారతీయ ప్రజాస్వామ్యాన్ని ఎత్తిపడుతుంది. భారతీయ సైన్యం వృత్తిగతతత్వానికి అది ప్రతీకగా ఉంటుంది. రాజ్యాంగం రీత్యా సైనిక బలగాలు ప్రజాస్వామికంగా ఎన్నికైన రాజకీయ నాయకత్వానికి పార్టీలతో పనిలేకుండా, నిష్పాక్షికంగా లోబడి ఉంటాయి. ఉండాలి కూడా. దీనివల్లే అధికారం శాంతియుతంగా మారినప్పుడల్లా ఎలాంటి సంక్షోభాలు లేకుండా ప్రభుత్వాలు గద్దెనెక్కగలుగుతున్నాయి. భారత ప్రజలు కూడా ఎలాంటి నిర్బంధ ప్రమాదం లేకుండా ఎవరు పాలించాలన్న ఎంపికను ఎంచుకోగలుగుతున్నారు. మరోమాటలో చెప్పాలంటే, సైన్యం ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే.. ప్రజలచేత ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు జాతీయ భద్రతా విధానపు విశ్వసనీయ అమలుపై ఆధారపడి పాలన సాగించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపార్టీలపై, సైన్యంపై, ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసం చెదిరిపోతుంది. రాజకీయాలకు అతీతమైన సైన్యం విభిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులను వారి సైద్ధాంతిక దృక్పథాలతో పనిలేకుండా సమానంగా గౌరవిస్తుంది. దీనికంటే మించి, సైనిక బలగాల నిర్వహణ రాజకీయ ప్రక్రియను బట్టి కాకుండా, పూర్తి వృత్తిగత నైపుణ్యంతో కొనసాగాలి. సైనిక వృత్తి ప్రాతిపదికపై ఉనికిలో ఉన్న నిబంధనలు, నియమావళిని ఇక్కడ నేను ప్రస్తావించదల్చుకోలేదు. వాటిగురించి అందరికీ తెలుసు, మీడియా ఇప్పటికే వాటిని చాలావరకు ప్రచారం చేసింది. ఇప్పుడు సాయుధ బలగాల సీనియర్ అధికారులు మీడియా ముందుకు వచ్చి, బహిరంగంగా ప్రభుత్వానుకూల రాజకీయ వైఖరులను ఎందుకు వ్యక్తపరుస్తున్నారు అన్నదే కీలకప్రశ్న. తాము ప్రాతి నిధ్యం వహిస్తున్న సాయుధ కమాండ్‌పై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కల్పిస్తుందన్న ఆలోచన కూడా లేకుండా వీరు ఇలాంటి వ్యవహారాలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమకు కల్పించిన అన్ని అవకాశాలకు కృతజ్ఞతగా తమ విశ్వాసాన్ని ఈ రకంగా ప్రదర్శించడానికి పూనుకుంటున్నారా? ప్రభుత్వానికి అనుకూలంగా బహిరంగంగా ఒకసారి సైన్యాధికారులు ప్రకటన చేశాక దానిపై తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చినా, తమ వ్యాఖ్యను సమర్థించుకునే ప్రయత్నాలు చేసినా దాని ప్రతికూల ప్రభావాన్ని ఎన్నటికీ తుడిచిపెట్టలేవు. సీని యర్ సైనికాధికారుల ప్రకటనలపై ఆధారపడటానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల వాణిని, వారి అభిప్రాయాలను పట్టించుకోవలసి ఉంది. వివిధ పార్టీలకు చెందిన విస్తృత ప్రజావర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాసకర్త : విజయ్ ఒబెరాయ్ , మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్,ఇండియన్ ఆర్మీ థింక్ టాంక్ సంస్థాపక డైరెక్టర్ -
రండి.. బీజేపీని ఏకాకి చేద్దాం
న్యూఢిల్లీ/చెన్నై/పురులియా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు తెలుపుతున్న వారు జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. కాషాయ పార్టీని ఏకాకిని చేసేందుకు కలిసి రావాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలకు ఆమె పిలుపునిచ్చారు. సీఏఏకి వ్యతిరేకంగా సోమవారం పురులియాలో చేపట్టిన 5 కిలోమీటర్ల నిరసన ర్యాలీలో మమత ప్రసంగించారు. సీఏఏతోపాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రాష్ట్రంలో అమలు కానివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. సీఏఏపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఓటరు జాబితాలో మీరంతా పేర్లు నమోదు చేయించుకోండి. ఆ తర్వాత వ్యవహారం నేను చూసుకుంటా’అని మమత అభయమిచ్చారు. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేసి, అరెస్టయిన వారికి సంఘీభావం తెలుపుతూ డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇల్లు, దివంగత కరుణానిధి ఇంటి వద్ద సంప్రదాయ ముగ్గులు వేశారు. సీఏఏ వద్దంటూ శనివారం చెన్నైలోని బీసెంట్ నగర్లో ముగ్గులు వేసినందుకు గాను ఐదుగురు మహిళలు సహా 8 మందిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ డీఎంకే నేతల నివాసాల వద్ద సోమవారం సీఏఏ వ్యతిరేక నినాదాలతో ముగ్గులు వేశారు. బాధిత కుటుంబాలకు సాయపడండి సీఏఏ వ్యతిరేక అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను కోరారు. శనివారం అస్సాం పర్యటన సందర్భంగా ఇద్దరు మృతుల కుటుంబాలను పరామర్శించినట్లు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో బాధిత కుటుంబాలను కలిసి, పరామర్శించిన విషయం తెలిసిందే. -
అవసరమైతే తీసుకుంటాం
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎన్పీఆర్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్పీఆర్ డేటాను ఎన్‌ఆర్‌సీకోసం ఉపయోగించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎన్పీఆర్కి, ఎన్ఆర్సీకి ఎలాంటి సంబంధం ఉండబోదని గతవారం హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో రవిశంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. ‘జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) కోసం సేకరించిన డేటాను జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అవసరాల కోసం ఉపయోగించొచ్చు.. లేదా ఉపయోగించకపోవచ్చు’అని రవిశంకర్ ప్రసాద్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘పాస్‌పోర్ట్‌లు, పాన్ కార్డు కోసం డేటా సేకరించినప్పుడు లేని సమస్య ఎన్ఆర్సీకి మాత్రమే ఎందుకు వస్తోంది, ప్రజలు ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు’అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. -
ఇది రెండో నోట్ల రద్దు..!
న్యూఢిల్లీ/గువాహటి/లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), ఎన్నార్సీలు రెండో విడత నోట్లరద్దు వంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి అమలైతే నోట్లరద్దును మించిన దారుణ పరిస్థితులను దేశం మరోసారి ఎదుర్కోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన పార్టీ ర్యాలీలో, అంతకుముందు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన హింసాత్మక ఘటనలు మునుపటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయంటూ రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే యావత్ దేశం మరోసారి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, మోతీలాల్ ఓరా, ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు సాగిస్తున్న పార్టీ, వ్యవస్థాపక దినం సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి(సేవ్ కాన్స్టిట్యూషన్– సేవ్ ఇండియా) అంటూ రాష్ట్ర రాజధానుల్లో ప్రదర్శనలు చేపట్టింది. భారత్‌కే తమ మొదటి ప్రాధాన్యమని 135వ వ్యవస్థాపక దినం సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది. ‘స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా అవతరించిన పార్టీ, దేశమే ప్రథమమనే ఆశయానికి కట్టుబడింది. 135 ఏళ్ల ఐక్యత, 135 ఏళ్ల న్యాయం, 135 ఏళ్ల సమానత్వం, 135 ఏళ్ల అహింస, 135 ఏళ్ల స్వాతంత్య్రం. నేడు మనం 135 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం’ అని శనివారం ట్విట్టర్లో పేర్కొంది. అస్సాం సంస్కృతిని నాశనం చేయనివ్వం అస్సాం సంస్కృతి, గుర్తింపులను నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను కొనసాగనివ్వబోమని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో మరోసారి హింసాత్మక వాతావరణ నెలకొనే అవకాశం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గుర్తింపును, భాషలను అణచివేయడం అంటే వారిని బీజేపీ ఇంకా గుర్తించలేదని అర్థమన్నారు. తీవ్ర పోరాటాలతో ఇక్కడి ప్రజలు సాధించుకున్న అస్సాం ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేసి, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బీజేపీ ఉన్న ప్రతిచోటా ప్రజల మధ్య కలహాలు, హింస, విద్వేషం ఉంటాయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో మోదీ ప్రభుత్వం భరతమాతపై దాడి చేసిందని విమర్శించారు. ‘ప్రతి పేద వ్యక్తీ భారతీయ పౌరుడా కాదా అని నిరూపించుకోవడమే ఎన్నార్సీ, ఎన్పీఆర్ల ఉద్దేశం. ఈ తమాషా అంతా నోట్ల రద్దు రెండో విడత మాదిరిగా మారనుంది. నోట్ల రద్దు కంటే మించి దారుణ పరిస్థితులను ప్రజలు ఎదుర్కోనున్నారు’ అని రాహుల్ అన్నారు. అబద్ధాల కోరు అంటూ బీజేపీ తనపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘దేశంలో డిటెన్షన్ సెంటర్లు(నిర్బంధ కేంద్రాలు) లేవంటూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగం, దానికి జతచేసిన డిటెన్షన్ సెంటర్ ఫొటోతో నేను చేసిన ట్వీట్‌ను మీరు చూసే ఉంటారు. అబద్ధం చెప్పేది ఎవరో మీరే తేల్చండి’ అని ఆయన పేర్కొన్నారు. -
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బొమ్మా బొరుసే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా రిజి స్టర్ (ఎన్పీఆర్)లు నాణానికి బొమ్మా బొరుసులాంటివేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ, సీఏఏ వల్ల ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు కూడా ఇబ్బందులు తప్పవని ఆయన ఆందో ళన వ్యక్తం చేశారు. ఎన్నార్సీ, సీఏఏకు వ్యతి రేకంగా ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగించారు. ఎన్పీఆర్ను ఆపాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా త్వరలో అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని అసదుద్దీన్ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందికరమైన చట్టాలను వ్యతిరేకిస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఆయనకు ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై అసద్ ప్రసంశల జల్లు కురిపించారు. కేసీఆర్ బతికున్నంత కాలం ఎంఐఎం ఆయనకు మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీకి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని.. ఇద్దరూ హిందువులే అయినప్పటికీ కేసీఆర్ లౌకిక భావాలున్న నాయకుడని కొనియాడారు. నిజామాబాద్ సభకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ను రెండుసార్లు ఆహ్వానించినా ఆ పార్టీ స్పందించలేదని విమర్శించారు. ఆ రెండు ఎన్పీఆర్లకు ఎంతో తేడా.. యూపీఏ హయాంలో 2010లో జరిగిన ఎన్పీఆర్కు, మోదీ ప్రభుత్వం 2020లో నిర్వహించనున్న ఎన్పీఆర్కు చాలా తేడా ఉందని అసదుద్దీన్ తెలిపారు. తాజా ఎన్పీఆర్లో కొత్తగా తల్లిదండ్రుల పేర్లు, వారు పుట్టిన ప్రాంతం, ఫోన్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అధికారులకు సందేహం వస్తే అలాంటి వారి పేర్లను పక్కనబెట్టి వారికి నోటీసులు జారీ చేస్తారని, మూడు నెలల్లో ఆధారాలు చూపకపోతే పౌరసత్వం నిరాకరించే అవకాశాలున్నాయని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం మంది మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జనన ధ్రువీకరణ పత్రాన్ని అడిగితే సామాన్యుల ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు. తామంతా ఇక్కడే పుట్టామని, ఇక్కడే మరణిస్తామని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా పౌరసత్వ సవరణ బిల్లు (పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం– సీఏఏ) ప్రతులను తాను చింపేయడాన్ని కొందరు ప్రశ్నించారన్న అసద్... మతప్రాతిపదికన తెచ్చే బిల్లులను తాను చింపేస్తానని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షావి అబద్ధపు మాటలు.. ఎన్నార్సీ, సీఏఏల విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షావి అబద్ధపు మాటలని అసదుద్దీన్ విమర్శించారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని చూసి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు కంటి మీద కునుకు కరువైందన్నారు. మతం పేరుతో దేశాన్ని విభజించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్, గాంధీజీ కలలు కన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ చదివిన ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే డిగ్రీ ప్రపంచంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్పైనా ఘాటు వ్యాఖ్యలు.. దేశ రాజ్యాంగంలో తలదూర్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ మండిపడ్డారు. 90 ఏళ్లపాటు చెడ్డీ వేసుకున్న ఆర్ఎస్ఎస్... ఇప్పుడు ప్యాంటు ధరిస్తోందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఇలాంటి సభలను నిర్వహిస్తున్నామన్న ఎంఐఎం అధినేత... రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో అన్ని మతాలకు సమాన హక్కుందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో ముస్లిం వీరులు త్యాగాలు చేశారన్నారు. అస్సాం పునరావాస కేంద్రాల్లో 19 లక్షల మంది ఉన్నారని, వారిలో 5.40 లక్షల మంది ముస్లింలని పేర్కొన్నారు. ‘మిగతా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి 5.40 లక్షల మంది ముస్లింలు తమ పౌరసత్వం కోసం ఎవరిని ఆశ్రయించాలి?’అని అసద్ ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల నుంచి ఉన్న వారిలో 28 మంది మరణించారని, మిగిలిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగంలోని ముందుమాటను సభకు హాజరైన వారితో అసదుద్దీన్ చదివించారు. ఈ సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షకీల్ అమేర్ (బోధన్), నల్లమడుగు సురేందర్ (ఎల్లారెడ్డి), జెడ్పీ చైర్పర్సన్ దాదన్నగారి విఠల్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాటల యుద్ధం
న్యూఢిల్లీ/రాయ్‌పూర్/కోల్‌కతా/ముంబై/సిమ్లా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) దేశవ్యాప్త అమలు ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. సీఏఏను జీవించి ఉండగా అమలు కానివ్వనంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినబూనగా ఎన్పీఆర్, ఎన్నార్సీలను పేదల జేబులు గుల్లచేయడానికే ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అనే మూడింటిని త్రిశూలంగా మార్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలపై దాడికి పూనుకుందని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలును వ్యతిరేకంగాదేశంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఇవి పన్ను భారం వంటివే ‘దేశ ప్రజల హక్కులను ఎవరూ లాగేసుకోలేరు. నేను బతికి ఉన్నంత కాలం రాష్ట్రంలో సీఏఏను అమలు కానివ్వను. బెంగాల్లో ఎలాంటి నిర్బంధ కేంద్రాలు లేవు’ అని నైహటిలో జరిగిన ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్పీఆర్, ఎన్నార్సీలు ప్రజలపై పన్ను భారం వంటివేనన్నారు. ‘నోట్ల రద్దు సమయంలో ప్రజల వద్ద డబ్బును బ్యాంకులు లాగేసుకున్నాయి. అదంతా మోదీకి సన్నిహితులైన 15, 20 మంది పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్పీఆర్, ఎన్నార్సీలు అమలైతే పేద ప్రజలు వివిధ పత్రాల కోసం అధికారులకు లంచాల రూపంలో మరోసారి డబ్బు ముట్టజెప్పే పరిస్థితి రానుంది’ అని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సామూహిక కృషి, ఐక్యతతోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. రాహుల్ అబద్ధాలు మానలేదు రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ‘ఎన్పీఆర్ ధ్రువీకరణల కోసం ప్రజలు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. సర్వేలో సేకరించిన సమాచారంతో నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలను వారికే అందేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో 2010లో జరిగింది’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ చీఫ్‌గా ఉండగా రాహుల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ పదవి లేకున్నా ఆయన అబద్ధాలు ఆపట్లేరు. ‘ఈ ఏడాది అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారూ అంటే.. అతడు రాహుల్ గాంధీయే’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు. సీఏఏ విషయంలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, పౌరసత్వం కోల్పోతారంటూ ముస్లింల్లో వదంతులు రేపుతున్నాయని సిమ్లాలో హోం మంత్రి అమిత్‌షాఆరోపించారు. ‘సీఏఏలో పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు సంబంధించి ఏవైనా నిబంధనలు ఉంటే చూపించాలని రాహుల్ బాబాకు సవాల్ చేస్తున్నా’ అని అన్నారు. ప్రతిపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలు ముంబై మహా నగరం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)లపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలకు శుక్రవారం వేదికగా మారింది. బీజేపీకి చెందిన సంవిధాన్ సమ్మాన్ మంచ్ నేతృత్వంలో చారిత్రక క్రాంతి మైదాన్‌లో చేపట్టిన ర్యాలీలో బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఎన్నార్సీ, సీఏఏలపై వదంతులు, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భీమ్ ఆర్మీ ర్యాలీ అడ్డగింత భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేతులను బంధించుకుని ప్రధాని మోదీ నివాసం వైపు ర్యాలీగా తరలివస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. జోర్‌బాగ్‌లోని దర్గా షా–ఇ–మర్దన్ నుంచి శుక్రవారం ప్రార్థనల అనంతరం చేతులను బంధించుకుని కొందరు ప్రధాని నివాసం లోక్‌కల్యాణ్ మార్గ్ వైపుగా ర్యాలీగా కదలివచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. -
జాబితాల జగడం
-
సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ/కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏను ఉపసంహరించుకునే దాకా నిరసనలను ఆపేది లేదని బెంగాల్ సీఎం మమత అన్నారు. అది నాయకత్వ లక్షణం కాదు ‘సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నిరసన కారుల్లో ఎక్కువమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ప్రజలను హింసకు ప్రేరేపించడం నాయకత్వ లక్షణం కాదు’అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాయకుడంటే సరైన దిశలో నడిపించేవాడు. మంచి సూచనలిస్తూ మన సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అతడు ముందు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు. అయితే, ఇది అనుకున్నంత సులువు కాదు. చాలా క్లిష్టమైన వ్యవహారం.’అని తెలిపారు. అయితే, రాజకీయ పరమైన వ్యవహారాల్లో జనరల్ రావత్ తలదూర్చడం కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ‘ఆయన చెప్పింది నిజమే. అయితే, ప్రధాని పదవిపై ఆశతోనే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది’ అని ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికాధికారులకు మాత్రమే ఉంటుంది. ఆయనకు ఇలాగే మాట్లాడే అవకాశం ఇస్తే సైనిక తిరుగుబాటుకు కూడా దారిచూపినట్లవుతుంది’ అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ట్విట్టర్లో పేర్కొన్నారు. జనరల్ రావత్ తన పరిధి తెలుసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘జనరల్ రావత్‌తో ఏకీభవిస్తున్నా. మత విద్వేషాలు రెచ్చగొట్టి, రక్తపాతానికి పాల్పడిన వారు కూడా నాయకులు కాదుకదా?’అని ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా జనరల్ రావత్ వ్యాఖ్యలను ఖండించింది. ఈ పరిణామంపై ఆర్మీ స్పందించింది. ఆర్మీచీఫ్ వ్యాఖ్యలు కేవలం సీఏఏ ఆందోళనలనుద్దేశించి చేసినవి కావని పేర్కొంది. ఆయన ఏ రాజకీయ పార్టీని కానీ, వ్యక్తిని కానీ ప్రస్తావించలేదు. విద్యార్థులను గురించి మాత్రమే జనరల్ రావత్ మాట్లాడారు. కశ్మీర్ లోయకు చెందిన యువతను వారు నేతలుగా భావించిన వారే తప్పుదోవపట్టించారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 31వ తేదీతో రావత్ పదవీ కాలం ముగియనుంది. ఆందోళనలు ఆపేదిలేదు: మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని ఉపసంహరించుకోనంత కాలం ఆందోళనలను కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.సీఏఏకి వ్యతిరేకంగా గురువారం సెంట్రల్ కోల్‌కతాలో ఆమె భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనలను కొనసాగించాలని విద్యార్థులను కోరారు. ‘మీరు దేనికీ భయపడకండి. మీకు అండగా నేనుంటా. నిప్పుతో ఆటలు వద్దని బీజేపీని హెచ్చరిస్తున్నా’అని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై పోరాడుతున్న జామియా మిల్లియా, ఐఐటీ కాన్పూర్ తదితర వర్సిటీల విద్యార్థులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు తిండి, బట్ట, నీడ ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను కనిపెట్టే పని మాత్రం చేపట్టిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి సీఏఏపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అయోమయం సృష్టిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ‘పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఒక్క ప్రతిపక్ష నేత కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ చట్టంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ఢిల్లీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.కాగా కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)తో, 2010నాటి ఎన్పీఆర్కు పోలికే లేదన్నారు. ఎన్నార్సీతో సంబంధం లేకుండా, 2010 నాటి ఎన్పీఆర్ చేపట్టాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ దురుద్దేశంతో దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా గురువారం మైసూరులో జరిగిన భారీ ప్రదర్శన -
కేసీఆర్‌తో ఓవైసీ భేటీ
-
ఎన్ఆర్పీతో ఎన్పీఆర్కు సంబంధం లేదు
-
‘జాతీయ పౌర రిజిస్టర్‌ను ఆపండి’
సాక్షి, హైదరాబాద్: ‘కేరళ తరహాలో రాష్ట్రంలో సైతం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) పనులను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశాం. ఎన్పీఆర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ)కి ఏమాత్రం సంబంధం లేదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని సీఎంకు తెలిపాం. ఎన్‌ఆర్‌ఐసీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని పేర్కొం టున్న కేంద్ర హోంశాఖకు సంబంధించిన వివిధ పత్రాలను రుజువులుగా ఆయనకు అందజేశాం. నిర్ణయం తీసుకోవడానికి కేసీఆర్ రెండు రోజుల సమయం కోరారు. సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని భరోసా ఉంది’అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధి బృందంతో కలసి బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్పీఆర్ పనుల నిలుపుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం అసద్ మాట్లాడుతూ.. మూడు గంటలకు పైగా సీఎంతో సమావేశం సాగిందన్నారు. ఆర్టీకల్ 131 ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చని సలహా ఇచ్చామన్నారు. ‘ఈ అశంపై ఒకే రకమైన ఆలోచన ధోరణి కలిగిన పార్టీలతో కేసీఆర్ మాట్లాడుతారన్నారు. అవసరమైతే అందరినీ ఆహ్వానించి బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు.. యావత్ దేశానిది, రాజ్యాంగానిది అని సీఎం పదేపదే అన్నారు. మతాల పేరుతో ఓ చట్టం (సీఏఏ) రావడం దేశంలో ఇదే తొలిసారి’అని అసద్ తెలిపారు. ‘ఈ నెల 27న నిజామాబాద్‌లో తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. రాష్ట్ర మంత్రులను ఈ సభకు పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలను సభకు ఆహ్వానిస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని స్వయంగా ఆహ్వానిస్తా’ఎంఐఎం అధినేత తెలిపారు. సందేహాలు వ్యక్తం చేసే అధికారం... ‘రాష్ట్రంలో 29 శాతం జనాభాకే పుట్టిన తేదీ సర్టిఫికేట్లున్నాయి. ఎన్పీఆర్లో పుట్టిన తేదీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మిగిలిన వారు ఎక్కడి నుంచి తేవాలి?. ఎవరి పౌరసత్వంపై అయినా సందేహాలు వెల్లబుచ్చే అధికారాన్ని కింది స్థాయి అధికారులకు చట్టం కట్టబెట్టింది. ఎవరిదైనా పౌరసత్వానికి ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ సందేహాలు, అభ్యంతరాలకు ప్రమాణాలు ఏమిటి? పౌరుడిని ఎవరు నిర్ణయిస్తారు?. తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారో అడుగుతున్నారు. ఆధార్ అడుగుతున్నారు. దేశంలోని వంద కోట్ల ప్రజలు లైన్లలో నిలబడాల్సి వస్తుంది. అస్సాంలో 5.4లక్షల బెంగాలి హిందూవులకు పౌరసత్వం ఇచ్చి 5లక్షల బెంగాలి ముస్లింలకు ఎందుకు ఇవ్వరు?. 1948 చట్టం ప్రకారమే జనగణన జరగాలి’అని స్పష్టం చేశారు. ఇవిగో ఆధారాలు... ‘ఎన్‌ఆర్‌ఐసీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక 2018–19లోని చాప్టర్ 15(4) పేర్కొంది. ఇదే విషయాన్ని 2014 నవంబర్ 26న అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. అదే రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) పత్రికా ప్రకటనలో దీనిని తెలియజేసింది. కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లోని సివిల్ రిజిస్ట్రేషన్ డివిజన్‌కు సంబంధించిన రెండో పేజీలో ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. ఇన్ని రుజువులున్నా ఎన్ఆర్ఐసీ, ఎన్పీఆర్కి సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి తప్పుదోవపట్టిస్తున్నారు. సీఎంను కలసిన వారిలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆర్థికవేత్త అమీరుల్లాఖాన్, సినీ నిర్మాత ఇలాహీ, ముస్లిం పర్సనల్‌లా బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అస్మా తదితరులున్నారు. -
ఎన్ఆర్సీ అమలుకు అదే తొలి మెట్టు
సాక్షి, హైదరాబాద్: జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా జాబితా(ఎన్పీఆర్) రెండూ ఒకటేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్ఆర్సీ అమలుకు ఎన్పీఆర్ మొదటి మెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో పొందుపరిచారని వెల్లడించారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులతో పాటు బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన కలిశారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేయవద్దని కేసీఆర్‌ను ఆయన కోరారు. దాదాపు మూడు గంటల పాటు భేటీ జరిగింది. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ విన్నపాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, రెండు రోజుల్లో పార్టీ నిర్ణయం చెబుతామన్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అవుదామని సూచించినట్టు చెప్పారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఈనెల 27న నిజామాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తామన్నారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ఒక్క ముస్లింల సమస్య కాదని.. రాజ్యాంగం, ప్రాంతం సమస్య అని పేర్కొన్నారు. (ఎన్పీఆర్ వర్సెస్ సెన్సస్!) ఎన్పీఆర్, ఎన్ఆర్సీ రెండూ వేర్వేరు అని అమిత్ షా చెప్పడంపై అసదుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను అమిత్ షా తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మత పెద్దలు ముక్తి అజీముద్దీన్, రియాజుద్దీన్, గాయజుద్దీన్, ఖుబుల్ పాషా సూతరి, మౌలానా హాసన్ బిన్ హాల్ హుముమీ, నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగా, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి తదితరులు కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. (ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) -
కేసీఆర్‌ను కలువబోతున్న ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)తోపాటు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నడుం బిగించారు. ఈ విషయమై అసదుద్దీన్ నేతృత్వంలోని ఆలిండియా ముస్లిం యాక్షన్ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును నేడు (బుధవారం) కలువబోతోంది. ఈ మేరకు అసద్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రగతి భవన్లో వీరు సీఎం కేసీఆర్‌తో భేటీ అయి.. వినతిపత్రం ఇవ్వనున్నారు. రాజ్యాంగవిరుద్ధంగా ముస్లింలపై వివక్ష చూపేలా ఉన్న సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకించాలని, ఈ విషయంలో తమకు మద్దతుగా నిలువాలని వారు ముఖ్యమంత్రిని కోరే అవకాశముంది. ఎంపీ అసద్ వెంట మత పెద్దలు ముక్తీ అజీముద్దీన్, రియజుద్దీన్, గాయజుద్దీన్, ఖుబుల్ పాషా సూతరి, మౌలానా హాసన్ బిన్ హాల్ హుముమీ, నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి తదితరులు ఉన్నారు. -
కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంఐఎం
సాక్షి, మెట్టుగడ్డ(మహబూబ్‌నగర్) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఏఏ, ఎన్ఆర్సీపై ప్రజలకు తప్పుదోవ పట్టిస్తుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మతం, కులంతో సంబంధం లేకుండా అందరికీ ఈ దేశంలో సమానహక్కు రాజ్యాంగం కలి్పంచిందని తెలిపారు. కానీ మోదీ, అమిత్ షా నిరంకుశ పాలనతో చట్ట సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్లో అమిత్ షా దేశంలో ఎన్ఆర్సీ అమలు చేసి తీరుతామని చెప్పినప్పటికీ, మోదీ ఢిల్లీ బహిరంగసభలో ఎన్ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ (జనగణన) పేరుతో ఎన్ఆర్సీని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సీఏఏకి వ్యతిరేకంగా దేశంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు, ప్రజలపై కాల్పులు జరిపి 18మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. మత ప్రాతిపదికన తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కుల, మతాలకతీకంగా వ్యతిరేకించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ తరహాలో తెలంగాణలో కూడా ఎన్పీఆర్పై స్టే విధించాలని కోరారు. అనంతరం వక్తలు మాట్లాడారు. సమావేశంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ మొహమ్మద్ ఖాన్, సయ్యద్ అబ్దుల్ రజాక్ షా ఖాద్రి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, అబ్దుల్ హాదీ, జాకీర్, షఫీ ఉద్దీన్, సుజాత్ అలీ, ముస్లిం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలమూరులో భారీ బందోబస్తు మహబూబ్‌నగర్ క్రైం: పౌరసత్వ సవరణ చట్టంపై జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సభకు జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా మైదానం పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సభకు 320 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్సైఐలు, 30మంది ఏఎస్సైఐలు, దాదాపు 220కిపైగా ఇతర కానిస్టేబుల్స్‌తో రెక్కీ నిర్వహించారు. పట్టణంలో ఉన్న మజీద్లు, ముఖ్య కూడళ్లు, రద్దీ ఏరియాల్లో పోలీసులు ప్రత్యేకంగా గస్తీ నిర్వహించారు. జెడ్పీ మైదానంలో జరిగిన సభకు పోలీసులు లోపలికి వెళ్లే ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి పంపించారు. -
రాహుల్, ప్రియాంకలను ఆపేశారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/బిజ్నోర్/మీరట్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గత వారం ‘పౌర’ ఆందోళనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో నిషేధాజ్ఞలు విధించాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. దీంతో వారే వెనక్కి వెళ్లిపోయారు’ అని పోలీసులు తెలిపారు. ‘సంబంధిత ఉత్తర్వులను చూపాలని పోలీసులను అడిగాం. అవేమీ చూపకుండా వారు మమ్మల్ని వెనక్కి వెళ్లాలన్నారు’ అని రాహుల్, ప్రియాంక మీడియాతో అన్నారు. ‘పౌర’ చట్టంపై ఏకమైన విద్యార్థి సంఘాలు పౌరసత్వ చట్ట సవరణతోపాటు, కేంద్రం చేపట్టదలచిన జాతీయ పౌర పట్టిక, జనాభా పట్టిక సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 70 యువ, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి. నేషనల్ యంగ్ ఇండియా కో ఆర్డినేషన్ అండ్ కాంపెయిన్ (వైఐఎన్‌సీసీ) ఛత్రం కింద ఈ సంఘాలు మంగళవారం ఏకమయ్యాయి. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముందుగానే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వైఐఎన్‌సీసీ సభ్యుడు సాయి బాలాజీ డిమాండ్ చేశారు. అతడు మా కాల్పుల్లోనే చనిపోయాడు ‘పౌర’ ఆందోళనల సందర్భంగా ఒక యువకుడి మృతికి తామే కారణమని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ పోలీసులు అంగీకరించారు. బిజ్నోర్‌లోని నహ్తౌర్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మంగళవారం వెల్లడించారు. కాగా, ఎన్నార్సీపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనలు పొంతనలేకుండా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ గవర్నర్‌కు చుక్కెదురు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ మరోసారి భంగపాటుకు గురయ్యారు. కోల్‌కతాలో జాదవ్‌పూర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎంసీ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయన వాహనం వర్సిటీలోకి ప్రవేశించకుండా మెయిన్ గేట్ వద్దే రోడ్డుపై బైఠాయించారు. గో బ్యాక్ అని నినాదాలు చేసుకుంటూ, నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అయిన సురంజన్ దాస్‌కు గవర్నర్ ఫోన్ చేశారు. ఆందోళనకారులను శాంతింప జేయాలని సురంజన్‌ను కోరారు. ఫలితం లేకపోవడంతో గవర్నర్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ధంకర్ మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. -
ఎన్పీఆర్ వర్సెస్ సెన్సస్!
సాక్షి, న్యూఢిల్లీ: జనగణన–2021కి, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జనగణన(సెన్సస్)కు, ఎన్పీఆర్కు మధ్య కొన్ని తేడాలను గమనిస్తే... జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఎన్పీఆర్ అంటే దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక రిజిస్టర్. పౌరసత్వం చట్టం–1955 పరిధిలో పౌరసత్వ నిబంధనలు, 2003 ఆధారంగా ఈ ఎన్పీఆర్ను రూపొందించనున్నారు. ప్రతి సాధారణ పౌరుడి వివరాల డేటాబేస్‌ను రూపొందిస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. స్థానిక(గ్రామ/మండల), తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్పీఆర్ను అప్డేట్ చేస్తారు. ఎన్పీఆర్లో వ్యక్తి పేరు, నివాస స్థితి, కుటుంబ యజమానితో గల బంధుత్వం, లింగ భేదం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వాముల పేర్లు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా వంటి 14 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ప్రతీ పౌరుడు ఈ పట్టికలో నమోదు కావాల్సిందే. వారికి జాతీయ గుర్తింపు కార్డును ఇస్తారు. సాధారణ నివాసుల సమగ్ర వివరాలున్న డేటాబేస్‌ను రూపొందించేందుకు ఎన్పీఆర్ను రూపకల్పన చేశారు. ఈ డేటాబేస్‌లో ఆ నివాసుల ఇతర, బయోమెట్రిక్ వివరాలుంటాయి. జనగణన (సెన్సస్): ఎన్పీఆర్తో పోలిస్తే జన గణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయ– వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగు నీటి లభ్యత, వ్యవసాయ విధానం, వాణిజ్య వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, మతం, దివ్యాంగత.. తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. జనగణన– 2021ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య తొలి దశను పూర్తి చేస్తారు. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9 – 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు. ఎన్నార్సీ అంటే.. చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌర పట్టిక(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్నార్సీ). ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం..భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్ అవుతోంది. భారతీయ పౌరుడంటే ఎవరు? 1955 పౌరసత్వ చట్టం ప్రకారం.. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం.. ఎ) 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకుపూర్వం కానీ..1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు. బి) 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకుముందు పుట్టిన వారు. అయితే.. 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించిన వారు; తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా.. సి) 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారు; తల్లిదండ్రులిద్దరూ పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణింపబడతారు. -
‘ఎన్పీఆర్’కు కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఒకవైపు తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలోనే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్– ఎన్పీఆర్)ను తాజాగా సవరించేందుకు(అప్డేట్) రూ. 3,941.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన – 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలోని ‘సాధారణ నివాసుల’ వివరాలను ఈ ఎన్పీఆర్లో నమోదు చేస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. మొదట 2010లో జాతీయ జనాభా పట్టికను రూపొందించగా, 2015లో ఇంటింటి సర్వే ద్వారా దీన్ని అప్డేట్ చేశారు. 2021 జనాభా గణనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జనాభా పట్టికను సవరించేందుకు తాజాగా నిర్ణయం జరిగింది. అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నార్సీతో సంబంధం లేదు ఎన్పీఆర్ను 2010లోనే రూపొందించారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. యూపీఏ హయాంలో పౌరసత్వ చట్టం–1955 లోని నిబంధనల కింద 2010లోనే ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభమైందని, 2015లో ఒకసారి అప్డేట్ అయిందని వివరించారు. అప్పుడు ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. తాజాగా, ఆ జాబితాను అప్డేట్ చేస్తున్నామని వివరించారు. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక) ప్రక్రియ చేపడ్తారన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఎన్పీఆర్కు ఎన్సార్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మరో మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆయన వెల్లడించారు. ‘ఎన్పీఆర్ ప్రక్రియలో ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే బయోమెట్రిక్ ముద్రలు కూడా అవసరం లేదు. ఇదొక స్వీయ ధ్రువీకరణ వంటిదే. కేంద్ర సంక్షేమ పథకాలను అవసరమైన వారందరికీ చేర్చే లక్ష్యంతో ఈ ఎన్పీఆర్ ప్రక్రియ ఉంటుంది. గతంలో మాదిరిగా పెద్ద దరఖాస్తు నింపాల్సిన పనేమీ లేదు. మొబైల్ యాప్ ద్వారా సులువుగా నింపే వెసులుబాటు ఉంటుంది’ అని వెల్లడించారు. అయితే, జనగణన కమిషనర్ అధికారిక వెబ్సైట్లో మాత్రం ఎన్పీఆర్ కోసం బయోమెట్రిక్ వివరాలను కూడా సేకరిస్తామని ఉండటం గమనార్హం. గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఎన్పీఆర్ డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఉపయోగించుకున్నాయని జవదేకర్ గుర్తు చేశారు. ఎన్పీఆర్ డేటాను ఆయుష్మాన్భారత్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఉజ్వల, సౌభాగ్య తదితర కేంద్ర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, కేరళసహా కొన్ని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఎన్పీఆర్ కార్యక్రమంలో పాలు పంచుకోబోమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయగా.. ‘ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. దీనికి సంబంధించి అధికారులకు శిక్షణనివ్వడం కూడా ప్రారంభించాయి’ అని జవదేకర్ సమాధానమిచ్చారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్: కాంగ్రెస్ ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ చర్య రాజ్యాంగంలోని లౌకికభావనకు భంగకరమని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి ఏమాత్రం సంబంధం లేదంటూ హోం మంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రకటన..ఎన్నార్సీపై పార్లమెంట్లో చర్చించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య కంటే పెద్ద అబద్ధమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఎన్నార్సీకి మొదటి మెట్టు ఎన్పీఆర్ అంటూ హోం శాఖ తన వార్షిక నివేదికలో తెలిపిందన్నారు. 2021లో జనగణనతోపాటుగా ఎన్పీఆర్ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జనగణన’కు ఆమోదం దేశ జనాభాను లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన– 2021 కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8,754.23 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఇది దేశంలో జరిగే 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. ఈ జనగణన దేశమంతటా చేస్తారు. జనగణన రెండు విడతలుగా జరుగనుంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కుటుంబాల గణన, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు మొత్తం జనాభా గణన ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరిస్తుండడంతో జనగణన వివరాలను ప్రకటించే అవకాశముంది. -
ఎన్పీఆర్కు పచ్చజెండా
ఒకపక్క వివిధ రాష్ట్రాల్లో జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్సీఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లు వెత్తుతుండగా మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియ అమలు ప్రతిపాదనను ఆమోదించింది. ఇందుకోసం రూ. 3,941 కోట్లు కేటా యించింది. ఎన్సీఆర్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యం కావొచ్చు... కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను ప్రక టిస్తూ ఎన్పీఆర్కూ, ఎన్ఆర్సీకీ సంబంధం ఉండబోదని కేంద్ర మంత్రులు ప్రకాష్ జావ్డేకర్, పీయూష్ గోయెల్ తెలిపారు. విధాన నిర్ణయాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఎన్పీఆర్ అమలు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన కూడా ఎన్పీఆర్–ఎన్ఆర్సీల మధ్య ఏ సంబంధమూ ఉండబోదని హామీ ఇచ్చారు. ఎన్పీఆర్కు సంబంధించిన సమాచార సేకరణ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుంది. తొలిసారి దీన్ని 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2015లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అమలు చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఎన్పీఆర్ను నవీకరించింది. ఎన్పీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక 2021లో జనాభా గణన ఉంటుంది. అదే సమయంలో ఆ ఎన్పీఆర్ డేటాను నవీకరిస్తారు. భిన్న అవసరాల కోసం ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన డేటా సేకరించడం ఎప్పటినుంచో రివాజుగా వస్తోంది. చరిత్ర తిరగేస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతక్రితం మాటెలా ఉన్నా మన దేశంలో మౌర్యుల కాలంలో జనగణన జరిగిందని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. అప్పట్లో ఈ జనగణన జరపడానికి కారణం పన్నుల వసూలు విధానాన్ని పటిష్టపరచడమే. బ్రిటిష్ వలస పాలకులు తొలిసారి 1872లో జనగణన నిర్వహించారు. తొలి జనగణనగా దాన్నే పరిగణిస్తున్నారు. 2021లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ ఆ ప్రకారం 16వ జనగణన అవుతుంది. ఈ జనగణన మాట అలావుంచి దేశంలో ఉండే పౌరులు, ఇతర నివాసుల వివరాలు ఆధారాలతోసహా సేకరించి అవసరమైనప్పుడల్లా ఆ వివరాలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్న ఆలోచనకు పెద్ద నేపథ్యమేవుంది. 1999లో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులు పౌర దుస్తుల్లో చొరబడి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం, మన సైనికులు దాన్ని తిప్పికొట్టి విజయం సాధించడం జరిగాక పౌరు లకు గుర్తింపు కార్డు ఇవ్వాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వాజపేయి ప్రభుత్వం నియమించిన కార్గిల్ సమీక్ష కమిటీ ఈ సూచన చేసింది. సరిహద్దు ప్రాంతాల్లోని వారికి ఈ కార్డులు అంద జేయాలన్న ప్రతిపాదన కాస్తా ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నిర్ణయానికి దారి తీసింది. అందుకోసం 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు (ఎంఎన్ఐసీ) ప్రాజెక్టు, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లకు చోటిచ్చారు. అయితే 2002లో ఈ రెండు ప్రాజెక్టుల మాటా ఏమైందని పార్లమెంటులో అడిగినప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు ఎంఎన్ఐసీకి చట్టబద్ధత కల్పించడంతోసహా ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ లోతుగా పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రతిపాదనల్లో ఆధార్ మూలాలు న్నాయి. ఎంఎన్ఐసీపై ఆ తర్వాత చెప్పుకోదగ్గ అడుగులు పడలేదు. యూపీఏ హయాంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో నందన్ నీలేకని చీఫ్‌గా భారత ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ (యూఐడీఏఐ) ఏర్పడి, ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దాన్ని ప్రారంభించిన ఉద్దేశం పెద్దగా నెర వేరలేదు సరిగదా దానివల్ల పౌరుల వ్యక్తిగత వివరాలు బజార్నపడి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ బృహత్తరమైన ప్రాజెక్టుకు చట్టబద్ధత తీసుకురావాలన్న స్పృహ, అది లీకైన పక్షంలో జవాబుదారీ తనం ఎవరు వహించాలో నిర్ణయించాలన్న ఆలోచన కూడా యూపీఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మరోపక్క కార్డు నమోదు ప్రక్రియకు అనుసరించిన విధానాలవల్ల ఎవరికి పడితే వారికి ఆ కార్డు సంపాదించడం సులభమైపోయింది. వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభం కాబోయే ఎన్పీఆర్లో ‘సాధారణ నివాసుల’ వివరాలను సేక రిస్తారు. ఈ నివాసులు మన దేశ పౌరులే అయివుండనవసరం లేదు. ఒక ప్రాంతంలో ఆర్నెల్లుగా నివసిస్తున్నవారు... లేదా వచ్చే ఆరునెలలూ అంతకన్నా ఎక్కువకాలం అక్కడ ఉండదల్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ నిర్వచనం పరిధిలోకొస్తారు. వీరంతా ఎన్పీఆర్లో నమోదుకు అర్హులు. అది తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. ఎన్పీఆర్ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, వారి తల్లిదండ్రుల జన్మస్థలం వివరాలు అందజేయాల్సివుంటుంది. ఇవన్నీ ఈసారి కొత్తగా పెట్టిన నిబం ధనలు. అంతక్రితం పేరు, జెండర్, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ యజమానితో ఉండే సంబంధం, పుట్టిన తేదీ, జాతీయత, చేస్తున్న వృత్తి, చిరునామా వివరాలు మాత్రమే అడిగేవారు. ఏతావాతా గతంలో ఆధార్ కార్డు నమోదుకు అందజేసిన వివరాల్లో చాలా భాగం మళ్లీ ఎన్పీఆర్లో కూడా ఇవ్వకతప్పదు. అయితే ఈ రెండింటిలోని వివరాలూ సరిపోల్చడం అంత సులభమేమీ కాదు. వేర్వేరు ప్రాజెక్టుల కింద సేకరించే డేటానంతటినీ ఒకే డేటా బేస్‌లో ఉంచగలిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఎన్ఆర్సీపై సాగుతున్న నిరసన ఉద్యమాల పర్యవసానంగా ఎన్పీఆర్కూ, దానికి సంబంధం లేదని, ఈ డేటాను దానికి వినియోగించబోమని అమిత్ షా చెబుతున్నారు. ఎన్పీఆర్ కింద నమోదు కానట్టయితే అలాంటివారు అనేక విధాల నష్టపోతారంటున్నారు. ఇన్ని రకాల డేటాను సేకరించడం, దాన్ని నిక్షిప్తం చేయడం, వినియోగించడం వంటివి ప్రభుత్వానికి అవసరమే. కానీ ఆ సేకరిస్తున్న డేటా లీక్ కాకుండా చూడటం, అలా అయినపక్షంలో జవాబుదారీతనం ఎవరిదో నిర్ణ యిం చడం అవసరమని గుర్తించాలి. వ్యక్తిగత డేటా పరిరక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా సంకల్పించింది. అయితే ఎన్పీఆర్ ప్రారంభం కావడానికి ముందే అది సాకారం కావాలి. -
ఎన్పీఆర్: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ) గురించి దుష్ప్రచారం చేసే వారి వల్ల మైనార్టీలు, పేదలకు నష్టం కలుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) ప్రభుత్వ హయాంలోనే ఎన్పీఆర్ రూపొందించారని పేర్కొన్నారు. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ... ఎన్పీఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం.. దీనినే ఎన్నార్సీకి ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి ఎటువంటి సంబంధం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.(చదవండి : ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ఎన్నార్సీపై పార్లమెంటులో, కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదు. మీరు దేశ పౌరులా కాదా అనే ప్రశ్నలు ఎన్ఆర్పీలో ఉండవు. నిజానికి యూపీఏ హయాంలోనే ఎన్ఆర్పీ రూపొందించారు. కానీ అప్పుడు ఎవరూ దీనిపై ప్రశ్నించలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నారు. అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టం ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే ప్రస్తావన లేదు. కేరళ, బెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఇదెంతో ఉపయోగకరం. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలించాలి. ఎన్పీఆర్ విషయంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన ప్రక్రియనే మేం కొనసాగిస్తున్నాం. ఎన్పీఆర్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించాం. ఎన్పీఆర్లో ఆధార్, ఓటరు నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు సేకరించడంలో ఎలాంటి తప్పు లేదు’ అని అమిత్ షా పేర్కొన్నారు.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) -
కేంద్రం కీలక నిర్ణయం: ఎన్పీఆర్ అంటే ఏమిటి?
సాక్షి, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా జాతీయ ప్రజా రిజిస్టర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 8500 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్పీఆర్తో పాటు 2021 జనాభా లెక్కల ప్రక్రియ సెప్టెంబరు 2020 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో అసలు ఎన్పీఆర్ అంటే ఏమిటి... దాని ముఖ్య ఉద్దేశం, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు, ఎన్పీఆర్ నుంచి అసోంను ఎందుకు మినహాయించారు తదితర అంశాల గురించి గమనిద్దాం. ఎన్పీఆర్ అంటే ఏమిటి? దేశంలోని ప్రతీ పౌరుడి కచ్చితమైన వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ ముఖ్య ఉద్దేశం. ఎన్పీఆర్ ప్రకారం... ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక వ్యక్తి గల ఆరు నెలలుగా నివాసం ఉంటున్నా లేదా మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడే నివాసం ఉండాలనుకుంటే అతడిని యూజువల్ రెసిడెంట్(సాధారణ నివాసి)గా పేర్కొంటారు. పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు(రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) 2003లోని వివిధ ప్రొవిజన్లను అనుసరించి... గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం తదితర విభాగాల్లో దేశంలోని పౌరుల వివరాలను సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్‌లో జనాభా లెక్కలు, పౌరుల బయోమెట్రిక్ వివరాలు, ఆధార్, మొబైల్, పాన్ నంబర్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ వివరాలు.. అదే విధంగా పాసుపోర్టు నంబర్లను నిక్షిప్తం చేస్తారు. అయితే ఇందులో ఆధార్ నంబరు వాలంటీరిగా ఇస్తే మాత్రమే తీసుకుంటారు. ఏయే వివరాలు అడుగుతారు? ఎన్పీఆర్ ప్రక్రియలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటి యజమాని, తండ్రి పేరు, తల్లి పేరు, వివాహితులైతే భార్య/భర్త పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, జాతీయత, తాత్కాలిక చిరునామా, శాశ్వత చిరునామా, ఈ చిరునామాల్లో ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు?, వృత్తి, విద్యార్హతల గురించి ప్రశ్నిస్తారు. డోర్-టూ- డోర్ సర్వే ఆధారంగా... ఎన్పీఆర్ కోసం.. 2011 జనాభా లెక్కల సేకరణలో భాగంగా 2010లో సేకరించిన డేటాను.. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా నవీకరించి.. డిజిటలైజ్ చేశారు. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల ప్రక్రియ ఆధారంగా అసోం మినహా భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్పీఆర్ను వద్దన్న రాష్ట్రాలు.. ఎన్పీఆర్, ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అడ్డుచెప్పింది. సీఏఏపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలును తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ ఆధారంగా ఎన్నార్సీ అమలు ఉంటుందన్న నేపథ్యంలో ఎన్పీఆర్ ప్రక్రియను తమ రాష్ట్రంలో అనుమతించబోమని తెలిపారు. అదే విధంగా కేరళ, రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పీఆర్ ప్రక్రియకు సహకరించబోమని స్పష్టం చేశాయి.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) అసోంను ఎందుకు మినహాయించారు? ఎన్పీఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్సీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అసోంలో ఇటీవలే ఎన్నార్సీను అమలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ నిజమైన పౌరుల వివరాలను సేకరించే ఎన్పీఆర్ ప్రక్రియలో అసోంను మినహాయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అపోహలు వద్దు.. ఎన్పీఆర్ డేటా పబ్లిక్ డొమైన్లలో కనిపించదు. ప్రొటోకాల్‌ను అనుసరించి కొంతమంది ప్రత్యేక యూజర్లకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు ఎన్పీఆర్ డేటాను వినియోగించుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పౌరుల వ్యక్తిగత డేటా భద్రతపై అపోహలు వద్దని విఙ్ఞప్తి చేసింది. -
ఎన్పీఆర్: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గం మంగళవారం ఆమోదించిన ఎన్పీఆర్ ఆమోదం, తదితర అంశాలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియా సమావేశం నిర్వహించారు. జనాభా నమోదు కార్రయక్రమాన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని తెలిపారు. 2010లోనే దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొలి కార్డును జారీ చేశారని తెలిపారు. భారతదేశంలో జీవించే ప్రజలందరి జాబితాను రూపొందించేందుకే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. పీయూష్ గోయల్ తదితర మంత్రివర్గ సహచరులు పాల్గొన్న ఈ సమావేశంలో రూ. వేల కోట్ల అటల్ భూజల్ యోజనకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. అలాగే ఆయుధాల చట్టంలో సవరణలు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు- ముఖ్యాంశాలు : 2021 ఫిబ్రవరి నుంచి 16వ జనాభా గణన వుంటుంది. ఇందుకోసం స్పెషల్ మొబైల్ ఆప్ తీసుకొస్తాం. ప్రజలు ఈ యాప్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుంది. అంతేకానీ, దీనికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు, బయో మెట్రిక్ వివరాల నమోదు వుండదు. ప్రధానంగా సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు వెలుగులోకి వస్తారు. తద్వారా లబ్దిదారులకు మేలు కలగనుంది. టూరిజం విభాగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. హిమాలయా, నార్త్ఈస్ట్, కృష్ట, కోస్టల్, ఇకో, డిజర్ట్, తీర్థాంకర్, రామాయణ తదితర 16 సర్క్యూట్స్ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఒక వ్యక్తి రెండు ఆయుధాలకు లైసెన్స్ కలిగి వుండేందుకు అనుమతి. గతంలో మూడువుండగా, తర్వాత ఒక ఆయుధానికి పరిమితం చేసినా, తాజా నిర్ణయంలో రెండు ఆయుధాలకు అనుమతి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమించబడే అధికారి ఫోర్ స్టార్ జనరల్ , సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా ఉంటారు. రైల్వే బోర్డు పునర్నిర్మాణం చారిత్రాత్మక నిర్ణయం. ఈప్రక్రియ కొనసాగుతోంది- మంత్రి పియూష్ గోయల్. మొత్తం 8 రైల్వే సేవలను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) కిందికి తీసుకురానుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.