
సాక్షి, బెంగళూరు: బీజేపీ నేతలు చేతబడి, క్షుద్రపూజలు చేసి గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించారని బీదర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఈశ్వరఖండ్రే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అధికారాన్ని కూడా తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేశారంటూ విమర్శించారు. బీదర్ పర్యటనలో ఉన్న ఈశ్వరఖండ్రే గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు.
‘గుజరాత్‌కు కర్ణాటకకు చాలా వ్యత్యాసం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ చాలా బలిష్టంగా ఉంది. 2019 ఎన్నికల్లో మోదీని ఓడించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు’ అని ఈశ్వర్ ఖండ్రే జోస్యం చెప్పారు.