సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్విటర్‌లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. పలువురు కష్టాల్లో ఉన్నవారు ట్విటర్‌లో కేటీఆర్‌ను అభ్యర్థించి.. సాయం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఐపీఎల్ ప్రేమికుడు కూడా ట్విటర్‌లో కేటీఆర్‌ను ఆశ్రయించాడు. ‘కేటీఆర్ సార్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు మూడు ఉచిత టికెట్లు ఇప్పించండి సార్’ అంటూ ఓ నెటిజన్ విజ్ఞప్తి చేశాడు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘నా వల్ల కాదు బాబూ..’ అంటూ ఓ దండం పెడుతూ రీట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Naa Valla Kaadu Babu 🙏 https://t.co/mtPCxasMrq
— KTR (@KTRTRS) 21 April 2018
Comments
Please login to add a commentAdd a comment