ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
పుణే : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని పుణే పోలీసులు చేసిన ప్రకటనపై భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళనలో భాగంగానే మోదీ ఈ హత్య నాటకానికి తెరలేరపారని దుయ్యబట్టింది. ఇలాంటి కట్టుకథలు అల్లి ప్రజలను మోసం చేయలేరని పేర్కొంది.
మోదీకి ఇలాంటి డ్రామాలు కొత్తకాదని చెప్పింది. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఇలానే ఆయన రాజకీయవ్యూహాలు వేశారని ఆరోపించింది. అయితే, ఆయన ప్రాణానికి ముప్పు ఉందని వస్తున్న రిపోర్టులు పూర్తిగా అబద్దమని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప అసలు నిజమేంటో బయటకు తెలీదని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమా సేన్, మహేష్ రౌత్, రోనా జాకబ్ విల్సన్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జాకబ్ విల్సన్‌ను అరెస్ట్ చేసిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment