
రాయికల్: తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు కన్నుపడిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నా రు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, మహా కూటమితో రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ప్రయ త్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని జలవనరులను ఆంధ్రాకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలతో కలసి కుట్ర పన్నుతున్నారన్నారు. కూటమికి ప్రజలంతా ఓట్లతో బుద్ధిచెప్పి టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగిత్యాలలో సంజయ్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment