ఎర్రుపాలెం మండలం రామన్నపాలెంలో మాట్లాడుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చింతకాని (ఖమ్మం): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బొప్పారం గ్రామంలో పలు పార్టీల నుంచి సుమారు 60 కుటుంబాలు ఎంపీ సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరాయి. వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ..నాలుగేళ్ల అధికారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భారీగా చేరుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు పథకా లను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపా రు.
బంగారు తెలంగాణ సాధన కోసం వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలు అభివృద్ధి నిరోధక పార్టీలని, ఇవి ఏకమై ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన కుటుంబరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్, జిల్లా సమితి సభ్యులు మంకెన రమేష్, నాయకులు కన్నెబోయిన సీతారామయ్య, కోలేటి సూర్యప్రకాశ్‌రావు, నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడి పాలనకు ఏపీలోనూ కితాబు
ఎర్రుపాలెం: బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. సోమవారం రాత్రి రామన్నపాలెంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గూడూరు రమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, సీపీఎంలనుంచి పలువురు ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ అభ్యర్థి కమల్‌రాజ్‌ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, ఆయన ఎప్పుడూ అందు బాటులో ఉంటూ తలలో నాలుక మాదిరిగా పని చేస్తారని చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను గెలిపిస్తే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరని, అభివృద్ధి జరగదని చెప్పారు. తాజా మాజీ ఎమ్మేల్యే భట్టి విక్రమార్క ఉద్దేశ్య పూర్వకంగానే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని ఆలస్యం చేస్తున్నారని ఆరోపిం చారు. రాబోయేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మధిర మార్కె ట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, భద్రాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, రైతు సమితి జిల్లా కమిటీ సభ్యులు వేమిరెడ్డి త్రివే ణి, మండల కన్వీనర్ శీలం వెంకట్రామిరెడ్డి, ఎం పీటీసీలు సామనూరి కృష్ణార్జునరాజు, అనిమిరెడ్డి, శారమ్మ, మాజీ సర్పంచ్ కర్నా టి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు షేక్ హుస్సేన్, శీలం ఉమామహేశ్వ రి, గుర్రాల పుల్లారెడ్డి, శెట్టిపల్లి మదన్‌రెడ్డి, తల్లపురెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment