పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, ఖమ్మం : భట్టి కోటకు బీటలు వారుతున్నాయన్న భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఖమ్మంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే ప్రజల నుంచి టీఆర్‌ఎస్‌కు అపూర్వ స్వాగతం లభిస్తోందని, ఈసారి కచ్చితంగా పదికి పది సీట్లు గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో తానో సైనికుడిలా పనిచేస్తుంటే కొంత మంది మాత్రం పనిగట్టుకుని తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఎవరినైనా కలిసినట్టు గానీ, మాట్లాడినట్లు గానీ నిరూపిస్తారా అని తన గురించి ప్రచారం చేస్తున్న వారికి పొంగులేటి సవాల్ విసిరారు.
కాగా గత కొన్ని రోజులుగా ముగ్గురు టీఆర్‌ఎస్ ఎంపీలు ఆ పార్టీని వీడనున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో చెబుతున్న సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఇక మిగిలిన ఆ ఇద్దరు ఎవరా అని గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment