
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(పాత చిత్రం)
సాక్షి, కిర్లంపూడి(తూర్పుగోదావరి జిల్లా) : ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సందించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఈ మధ్య మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని సీఎం చంద్ర బాబునుద్దేశించి విమర్శించారు. మీరు నిప్పు కదా.. నిప్పుకు భయం ఉంటుందా అని ఎద్దేవా చేశారు.
‘ ఏ ఘనకార్యం చేశారని ప్రజలు మీ వెనుక ఉండాలని కోరుకుంటున్నారు. మీ వెనకాలే ఉంటే మీ మాదిరిగానే అక్రమ కేసులు, ఉక్కుపాదాలతో అణచిచేస్తే అమాయక ప్రజలకు దిక్కెవరు. మీ కుమారునిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారు. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి సవాలు విసరకపోతే చరిత్రహీనులు కావడం తధ్యం. ఒకవేళ మిమ్మల్ని, మీ కుమారుడు నారా లోకేష్‌ని అరెస్టు చేస్తే..కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దని నా సలహా’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment