మెదక్ పార్లమెంట్ స్థానం జాతీయ స్థాయి నాయకుల అడ్డా. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మెదక్‌తో పాటు, ప్రస్తుతం మెదక్‌లో భాగమైన సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి మొదటి నుంచీ ఉద్దండులు పోటీ చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన వారు కేంద్ర మంత్రులుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇందిరాగాంధీ అయితే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రధానిగా భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా చాటిన ఇందిరాగాంధీ రాజకీయ ప్రస్థానం అమేథీ నుంచి ప్రారంభమైనా.. చివరిసారిగా మాత్రం ఆమె మెదక్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చి ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్‌గా విడిపోయిన సందర్భంలో 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున ఇందిర ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. అప్పట్లో ఆమెపై ఎస్.జైపాల్‌రెడ్డి పోటీకి నిలిచారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా మెదక్‌లో పోటీకి దిగిన ఇందిరాగాంధీకి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టి.. 2,19,124 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అయితే మెదక్ ఎంపీగా ఉన్న తరుణంలోనే 1984, అక్టోబర్ 31న జరిగిన కాల్పుల్లో ఆమె మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment