
సాక్షి, హైదరాబాద్: గద్వాల–మాచర్ల రైల్వేలైనుపై ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఆరోపించారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేశానని చెప్పారు.
గద్వాల–మాచర్ల లైన్‌కోసం 290 కోట్లు కేటాయించేలా అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభును ఒప్పించామన్నారు. సీఎం కు ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని, కలిసి మాట్లాడటానికి సమ యం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. కేంద్రం సానుకూలంగా ఉన్నా రాష్ట్రం భాగస్వామ్యం లేకపోవడంతో వాయిదా పడుతోందని ఎల్లయ్య విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment