
కోడిపందాల కత్తిని భద్రపర్చిన ప్రదేశాన్ని..
సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రీ కనస్ట్రక్షన్ చేస్తున్నారు. విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాస్‌రావును ఆదివారం విశాఖపట్నంకు తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో నిందితుడు పనిచేసిన టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌తో పాటు వీవీఐపీ లాంజ్‌ను పరిశీలించారు. నిందితుడ్ని తీసుకెళ్లి మరీ ఘటన జరిగిన తీరుతెన్నులను తెలుసుకున్నారు. కోడిపందాల కత్తిని భద్రపర్చిన ప్రదేశంపై కూడా ఆరా తీశారు.
అంతకుముందు విశాఖలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో నిందితుడు న్యాయవాది సలీం సమక్షంలో విచారణ జరపాలని అధికారులు భావించారు. కానీ తమ విచారణకు ఈ ప్రదేశం అనువైంది కాదని భావించి మరో చోటుకు తరలించేందుకు ఉన్నతాధికారుల అనుమతిని కోరారు. దీనికి సమ్మతి లభించడంతో నిందితుడు శ్రీనివాస్ రావును హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు.