మాచర్ల: పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో పట్టించుకోకుండా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడినప్పుడు ఏమీ మాట్లాడని సీఎం చంద్రబాబు, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వలన ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారనే విషయం గుర్తుకు వచ్చిందా... ఈ విషయంలోనూ యూ టర్నా అని వైఎస్సార్ సీపీ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అప్పుడు తన సలహాపైనే మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాడని చెప్పుకున్న సీఎం చంద్రబాబు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు నగదు కొరత గురించి మాట్లాడుతున్నారన్నారు.
నోట్ల రద్దు సమయంలో సామాన్యులు క్యూలో నిలబడి గుండెపోటుతో చనిపోయినప్పుడు కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదన్నారు. ఎప్పటికప్పుడు అన్నీ నా వల్లనే జరిగాయని గొప్పలు చెప్పుకోవడం, ఆ తరువాత ప్రజలు ఇబ్బంది పడితే యూ టర్న్ తీసుకొని ఎవరో ఒకరిని బాధ్యులను చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా, చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేకపోతే యూ టర్న్ తీసుకున్న సీఎంగా ప్రజల్లో చులకనై చివరికి ప్రజల చేతనే శిక్షింపబడే స్థాయికి దిగజారుతారన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment