హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎంలతో సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిన్ మే కాంగ్రెస్.. రాత్ మే ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సరూర్‌నగర్ స్టేడియంలో ‘నిరుద్యోగుల సమరభేరి‘ పేరిట బీజేవైఎం ఆదివారం భారీ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూనం మహాజన్ ... తెలంగాణ యువకుల స్వప్నాలను కేసీఆర్ నీరుగార్చారని మండిపడ్డారు. ఆయన తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు.
అధికార టీఆర్‌ఎస్ ఒక ప్రయివేట్ లిమిటెడ్ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జనవరిలో జరిగే ర్యాలీలో బైక్ పై తానే ముందుంటానని పూనమ్ తెలిపారు. నిజాంను కేసీఆర్ పొగడటాన్ని బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. కేసీఆర్..కలెక్టర్ ఆఫీస్‌లు వచ్చాయి.. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్ అని పూనం మహాజాన్ సూటిగా ప్రశ్నించారు. క్యా హువా తేరా వాదా అని బీజేవైఎం కేసీఆర్ ను నిలదీస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఢమరుకం వాయించి సమరభేరి మోగించి కార్యకర్తలను పూనమ్ ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రభుత్వంతో ఫైట్కు రెడీ నా అంటూ కార్యకర్తలను అడిగారు. తెలంగాణ బిడ్డను ఆంధ్రకు కోడలిని అని తెలిపారు. తెలంగాణ ఖుష్భు మహాజన్ రక్తంలో ఉందన్నారు. తెలంగాణ సర్కార్ పై ఈ సభ యుద్ధ భేరి అని తెలిపారు. కాగా పూనం మహాజన్ మహారాష్ట్రలో పుట్టినప్పటికీ తెలంగాణకు చెందిన ... వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లను వివాహం చేసుకున్నారు. అలాగే ఆనంద్‌రావు పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు.
Comments
Please login to add a commentAdd a comment