సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు (కేటీఆర్)తీరుపై, టీఆర్‌ఎస్ వైఖరిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చిప్పలు కడిగిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ఇక్కడికి వచ్చి కండకావరంతో మదమెక్కిన ఆంబోతుల వ్యవహరిస్తున్నారని పొన్నం విమర్శించారు. కేటీఆర్ చరిత్ర బయటపెడితే బయట తిరగడలేడన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని హెచ్చరించారు.
‘కేటీఆర్ జెన్నకిడిసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు మధ్యలో వచ్చిన లుచ్చాగాళ్లు ఎవరు?. మీ అయ్య(తెలంగాణ సీఎం కేసీఆర్)కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ అనే విషయం మరిచిపోవద్దు. టీఆర్‌ఎస్ చేసిన 6 సర్వేల్లో గ్రాఫ్ పడిపోయిందని తెలిసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. కరీంనగర్ జిల్లాను ముక్కలు చేసిన వారే లోఫర్లు, లుచ్చాగాళ్లు. తెలంగాణ తెచ్చుకున్నది నాలుగేళ్లలో రూ.2 లక్షల కోట్ల అప్పులు చేయడానికి కాదు. ప్రజలను తాత్కాలిక భ్రమల్లో ముంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. (కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లు..!)
సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టడంతోనే తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అమరవీరుల స్మృతీ చిహ్నం ఏమైంది?. రాహుల్ గాంధీ తాజా పర్యటనతో అధికార టీఆర్‌ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ అవినీతి కోసమే. కరీంనగర్‌లో మేము చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్లే స్మార్ట్ సిటీ వచ్చింది. టీఆర్ఎస్ వాళ్లు ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టే రోజులొస్తున్నాయి. కంటి పరీక్షలు తెలంగాణ ప్రజలకు కాదు, ముందుగా రాష్ట్ర మంత్రులు చేయించుకోవాలని’ పొన్నం ప్రభాకర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment