
మాట్లాడుతున్న పువ్వాడ అజయ్ కుమార్
సాక్షి, ఖమ్మం: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతోనే జిల్లా తెరాస శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల16 తేదీన ఖమ్మం పార్లమెంట్ తెరాస సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని తెరాస గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు టీఆర్‌ఎస్‌కు కొంత నిరాశ మిగిల్చాయని అన్నారు.మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలుపొందారని చెప్పారు. దేశంలోనే దార్శనికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శమని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో తెరాస గెలుపు తథ్యమని పువ్వాడ అజయ్ కుమార్ ధీమ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment