
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీనే తెలివి తక్కువతనంతో, అవగాహన లేకుండా మాట్లాడితే.. వాటిని పట్టుకొని పీసీసీ అధ్యక్షుడు కూడా తెలివి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చి న తరువాత కూడా విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ కుటిల నీతికి నిదర్శమన్నారు. 2008లోనే ఫ్రాన్స్‌తో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒప్పందం చేసుకుం దని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment