రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన ప్రతిపక్ష పార్టీల నేతల బృందం
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ నుంచి వెళ్లిన ప్రతిపక్షపార్టీల నాయకుల బృందాన్ని అధికారులు శ్రీనగర్‌లోనే నిలిపివేశారు. బృందంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్జేడీ, టీఎంసీ పార్టీలకు చెందిన 11 మంది నేతలు ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్న గవర్నర్ సూచనల మేరకే తాము ఈ పర్యటన చేపట్టినట్లు బృందం వెల్లడించింది. అక్కడ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని బీజేపీని ఉద్దేశించి సీపీఐ ఆరోపించింది.
దీనిపై జమ్మూ కశ్మీర్ ప్రభు త్వం స్పందించింది. ప్రతిపక్ష పార్టీల పర్యటన కశ్మీర్‌లో నెలకొన్న శాంతికి విఘాతం కలిగించే అవకాశం తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు రాలేదని సీపీఐ నేత డి.రాజా అన్నారు. ‘మేము క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించడానికే వచ్చాం తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి కాదు’ అని ఎల్జేడీ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ అన్నారు. ‘పరిస్థితులు బాగానే ఉంటే మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు? మేము చట్టాలను అతిక్రమించడానికి రాలేదు’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. హక్కులను ఓ నిరంకుశ ప్రభుత్వం ఎలా కాలరాస్తుందో దేశం గమనిస్తోందని సీపీఎం విమర్శించింది.
కశ్మీర్‌లోయలో ఆంక్షల ఎత్తివేత..
కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో శనివారం ఆంక్షలను ఎత్తివేశారు. ప్రార్థనల సందర్భంగా ఐక్యరాజ్య సమితి మిలిటరీ బృంద కార్యాలయాన్ని ముట్టడించాలని వేర్పాటువాదులు భావించారు. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఆంక్షలు విధిం చారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలుండగా, కొన్నిచోట్ల ల్యాండ్‌లైన్ ఫోన్లను అనుమతించారు.
సుప్రీంకోర్టులో పీసీఐ పిటిషన్..
జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్‌ను పరిశీలిం చాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించేందుకుగాను ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా ఆ పిటిషన్‌లో కోరారు. మీడి యా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆంక్షలు తొలగించేందుకు సహాయం చేయాలని పీసీఐ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment